Breaking News

నీకో దండం దివ్య.. చేతులెత్తి మొక్కిన భరణి

Published on Thu, 11/27/2025 - 08:01

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి యోధులు అంటూ మాజీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తున్నారు. వీరితో ఆడి గెలిచినవారు కెప్టెన్సీ కంటెండర్‌ అవుతున్నారు. ఓడినవారు చివరి కెప్టెన్సీ కోసం పోటీపడే అదృష్టాన్ని కోల్పోతున్నారు. మరి తాజాగా హౌస్‌లోకి ఎవరు వచ్చారు? ఎవరు కంటెండర్‌ అయ్యారనే విషయాలు బుధవారం (నవంబర్‌ 26వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

ఓడిన తనూజ
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి గత సీజన్‌ టాప్‌ 4 కంటెస్టెంట్‌ ప్రేరణ (Prerana Kambam) అడుగుపెట్టింది. ఆమెను చూడగానే తనూజ.. నువ్వే స్ట్రాంగ్‌.. నీతో ఆడాలనుందని చెప్పింది. వీళ్లిద్దరూ గేమ్‌ బాగా ఆడారు. కానీ, తనూజపై సెకన్‌ వ్యవధిలో ప్రేరణ గెలిచేసింది. ఇక దివ్య, భరణి గొడవలు ఏరోజుకారోజు ఫ్రెష్‌గా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎపిసోడ్‌లో కూడా ఇద్దరూ తగవు పడ్డారు. నా ఏజ్‌ టాపిక్‌ తీయకు.. పదిసార్లు ఏజ్‌ గురించి మాట్లాడితే చిరాకుగా ఉంటుంది. 

దివ్యకు క్షమాపణలు
మధ్యలో దూరి మరీ అది చెప్పాల్సిన పని లేదు. దేనికైనా లిమిట్‌ ఉంటుంది అని అసహనం వ్యక్తం చేశాడు. దానికి దివ్య.. నాకు నొప్పిగా ఉంటే నన్ను చూసి మీరు కుంటినప్పుడు లేదా? నాపై మీరు జోకులేయొచ్చు.. నేను జోకులేస్తే మాత్రం సీరియస్‌గా తీసుకుంటారని దివ్య మండిపడింది. దీంతో భరణి.. నీకో దండం దివ్య అని చెప్పి కాసేపటికి ఆమెకు చేతులు జోడించి మరీ సారీ చెప్పాడు.

మానస్‌పై గెలిచిన పవన్‌
తర్వాత దేత్తడి హారిక ఇంట్లోకి వచ్చింది. సుమన్‌తో ఆడి గెలిచింది. దీంతో అతడి కెప్టెన్సీ కంటెండర్‌ చేజారింది. అనంతరం మానస్‌ రాగా.. అతడు డిమాన్‌ పవన్‌ను ఎంచుకున్నాడు. వీరిద్దరూ ఆడిన ఆటలో పవన్‌ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌ అయ్యాడు. ఈరోజు శోభాశెట్టి, ప్రిన్స్‌ యావర్‌ వంటివారు హౌస్‌లోకి రానున్నారట! ఇకపోతే సుమన్‌, తనూజ, భరణి తప్ప మిగతా అందరూ కంటెండర్లయినట్లు తెలుస్తోంది.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)