Breaking News

మాధురి వస్తువు దొంగతనం.. గొడవ పడాలని చూస్తున్నావా?

Published on Wed, 10/15/2025 - 10:17

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మంచి ఊపు మీద ఉన్నట్లున్నారు. గొడవలు పెట్టుకోవడమే పనిగా ప్రతిదానికి రచ్చ రచ్చ చేస్తున్నారు. మాధురి అయితే ఇప్పుడు సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. బుధవారం అటు సంజనతో ఇటు దివ్యతో గొడవలు పెట్టేసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. చూస్తుంటే 38వ రోజు గట్టిగానే డ్రామా ఉండబోతుందనిపిస్తోంది.

ఉదయం లేవడం లేవడమే.. వంటగదిలోకి వచ్చిన మాధురి, బాత్రూమ్‌లో ఉంచిన తన స్టిక్కర్స్‌ని ఎవరు తీశారని సీరియస్ అ‍యింది. సంజననే అవి తీసి పడేశానని అనడంతో.. నావి ఎందుకు తీస్తున్నావ్? అయినా నీకు దొంగతనం అలవాటేగా అని రెచ్చిపోయింది. మరోచోట కెప్టెన్ కల్యాణ్‪‌తో దివ్య మాట్లాడుతూ.. వీళ్లంతా మెంటల్ గాళ్లు అని రెండు మూడు రోజుల క్రితం వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గురించి నోరు జారింది. స్మార్ట్, మెంటలో కాదు ఏదోటి కనిపించేయాలి, కంటెంట్ ఇచ్చేయాలి అన్నట్లు చేస్తున్నారని చెప్పుకొచ్చంది.

(ఇదీ చదవండి: తనూజ ప్లాన్ బయటపెట్టిన ఆయేషా.. ప్లేటు తిప్పిన ఇమ్ము!)

దీని తర్వాత కిచెన్‌లో ఉన్న ఎగ్ దోశలు వేసుకున్న మాధురి, కొంత కూర కూడా ప్లేటులో వేసుకుంది. నన్ను అడగకుండా ఎందుకు వేసుకున్నారని దివ్య అడిగేసరికి.. కొద్దిగా వేసుకున్నాను అని మాధురి సమాధానమిచ్చింది. ఒక్క సెకన్ అరవకండి అని దివ్య అనేసరికి.. వచ్చిన నుంచి గొడవ పడాలని చూస్తున్నావా అంటూ మాధురి సీరియస్ అయింది. నాకు ఈ ఫుడ్ మానిటర్ నచ్చలేదు మార్చేయండి అని చెప్పింది.

పర్సనల్‌గా నాకు మీకు బాండింగ్ అవసరం లేదు అని దివ్య అనగానే.. నాకు అస్సలు అవసరం లేదమ్మా, మీ బాండింగ్‌లు నాకెందుకు వాట్ ఏ జోక్, మేం బాండింగ్స్ కోసం వచ్చామనుకున్నారా? గేమ్ కోసం వచ్చామనుకున్నారా? నాన్న నాన్న అనుకుంటూ అని దివ్యని ఎగతాళి చేస్తున్నట్లు మాధురి మాట్లాడింది. ఎవరన్నారు అని దివ్య అనగానే.. పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారట అని మాధురి సామెత చెబుతూ తనూజవైపు చూసింది.

(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)