Breaking News

తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్‌

Published on Fri, 11/14/2025 - 14:36

బిగ్‌బాస్‌ షో (Bigg Boss Telugu 9) మొదలై దాదాపు 10 వారాలు కావస్తోంది. మాటకు మాట, ఆటకు ఆట అంటూ గేమ్స్‌ ఆడుతున్న కంటెస్టెంట్లకు ఇంటి మీద బెంగ మొదలై చాలారోజులే అవుతోంది. ఆ బెంగతోనే కదా.. రాము రాథోడ్‌ సెల్ఫ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ఈరోజు (నవంబర్‌ 14న) బాలల దినోత్సవం. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌కు వారి చిన్ననాటి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో అందించి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌.

లవ్యూ అమ్మా: తనూజ
వాటిని చూసి మురిసిపోయిన కంటెస్టెంట్లు వాటి వెనకాల కథను చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మొదటగా తనూజ మాట్లాడుతూ.. నా లైఫ్‌లో బెస్ట్‌ సూపర్‌ హీరో అమ్మ. నావల్ల కాదని వెనకడుగు వేసినప్పుడు.. నీవల్ల సాధ్యమవుతుంది అంటూ నన్ను ముందుకు నడిపించింది. నీవల్లే ఇక్కడున్నా సావిత్రి. లవ్యూ మమ్మీ అని ఎమోషనలైంది.

తినడానికి తిండి లేక మట్టి
ఇక ఇమ్మాన్యుయేల్‌ (Emmanuel)కు తన అన్నతో దిగిన ఫోటో వచ్చింది. అది చూసిన ఇమ్మూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మా అమ్మకు నన్ను కనడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికి మా ఇంట్లో తినడానికి తిండి లేదంటా! తిండి లేక అమ్మ మట్టి తినేది.. మా అన్న, నేను చిన్నప్పటినుంచి కష్టపడ్డాం. మేము చేయని పనంటూ లేదు. నా జీవితానికి మా అన్నే హీరో. 

చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన కల్యాణ్‌
చిన్నప్పటినుంచి మరో నాన్నలా పెంచాడు. 20 మూటలు మోయాలంటే వాడు 15 మోసి, నన్ను 5 మాత్రమే మోయనిచ్చేవాడు అని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక కల్యాణ్‌.. అమ్మానాన్నతో తిరిగింది గుర్తు లేదు. చిన్నప్పుడు ఏదీ అంత తెలిసేది కాదు. హాస్టల్‌లో జాయిన్‌ చేశారు. ప్రతి ఆదివారం ఫోన్‌ కోసం వార్డెన్‌ దగ్గర కూర్చునేవాడిని. కొన్ని నెలలవరకు ఫోన్‌ వచ్చేది కాదంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. మరి మిగతావారి స్టోరీలు తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

 

చదవండి: కల్యాణ్‌ను ఓడించి.. ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్‌గా

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు