Breaking News

మాధురి నోటికాడి కూడు లాక్కుంటారా? దివ్య ఓవరాక్షన్‌ ఏంటో?

Published on Sat, 11/01/2025 - 16:00

బిగ్‌బాస్‌ హౌస్‌ (Bigg Boss Telugu 9)లో ఏది జరిగినా ఒకరోజు ఆలస్యంగా చూపిస్తారు. అలా శుక్రవారం రోజు జరిగినదాన్ని నేడు ఎపిసోడ్‌లో చూపించనున్నారు. ఇక ఫ్రైడే అంటే పెద్దగా టాస్కులేవీ ఉండవు. కేవలం ఫన్‌ గేమ్స్‌ మాత్రమే ఉంటాయి. ఇటువంటి ఫన్‌ గేమ్స్‌ దగ్గరా గొడవ పడొచ్చని నిరూపించారు తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ కంటెస్టెంట్స్‌.

తిండి దగ్గర లొల్లి
తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో బిర్యానీ టాస్క్‌ ఇచ్చారు. ఈ గేమ్‌ పూర్తయ్యాక అందరూ ప్లేటులో బిర్యానీ వేసుకుని ఆవురావురుమని ఆరగించారు. ఓపక్క అందరూ తింటుంటే మాధురి అప్పుడే వచ్చి ప్లేటులో బిర్యానీ వేసుకోబోయింది. అది చూసిన భరణి, దివ్య వెంటనే ఆపేశారు. వేరే టీమ్‌కు ఇంకా పీసులు వెయ్యలేదు, వారికి వేశాక మీకు పెడతాను అని భరణి అడ్డుకున్నాడు. దీంతో మాధురి హర్టయిపోయింది. నీళ్లు తాగి కడుపు నింపుకుంది. 

ఆయనకు నోరు లేదా?
చిన్నచిన్నవాటికెందుకిలా.. అని భరణి (Bharani Shankar) వివరించబోయాడు. ఇంతలో దివ్య.. మధ్యలో కలగజేసుకుని మాట్లాడటంతో మాధురి అక్కడినుంచి లేచి వెళ్లిపోయింది. ప్లేటు పట్టుకున్నప్పుడు అలా అనేస్తే ఎలా తింటాం? అతడు అడుగుతున్నదానికి సమాధానం చెప్తున్నా.. మధ్యలో ఈమె (దివ్య) వివరణ ఇవ్వడం దేనికి? ఆయనకు నోరు లేదా? మాట్లాడలేడా? అని మాధురి.. కల్యాణ్‌ ఎదుట తన కడుపులో ఉన్నదంతా కక్కేసింది.

మీ గేమ్‌ మీరు ఆడండి
ఇక ఈ గొడవయ్యాక తనూజ.. భరణితో ఇది మీ గేమ్‌ మీరు ఆడండి.. మధ్యలో దివ్య ఎందుకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు అంది. నిజమే.. దివ్య ఇలా భరణిపై పెత్తనం చెలాయిస్తే అది అతడికే నెగెటివ్‌ అయి మళ్లీ ఎలిమినేట్‌ అవడం ఖాయం. మరి భరణి ఏం చేస్తాడో చూడాలి!

 

చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)