Breaking News

నాన్న అందుకే వెనకబడ్డాడు! ఆకాశానికెత్తి పాతాళంలో పడేశారు!

Published on Mon, 10/20/2025 - 13:18

నాన్న ఎందుకో వెనకబడ్డాడు. బంధాల మధ్యలో చిక్కుకుని బయటకు రాలేక అవస్థ పడ్డాడు. కూతురు, తమ్ముడు, సోదరుడు, స్నేహితుడు.. ఇలాంటి బంధాల్లో కూరుకుని నిండా మునిగిపోయాడు. బిగ్‌బాస్‌ ఆటను మర్చిపోయి తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకున్నాడు. అదే ఆయన ఎలిమినేషన్‌కు తొలి, చివరి కారణం!    

తన కోసం తగ్గిన భరణి
బిగ్‌బాస్‌ షో (Bigg Boss Telugu 9) ప్రారభమైన మొదటివారం భరణి మాటతీరు చాలామందికి నచ్చింది. తర్వాతి వారం ఆటతీరు నచ్చింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తనూజ.. నాన్న, నాన్న అంటూ వెనకపడటంతో ఆమె కోసం కొన్నిచోట్ల తగ్గాల్సి వచ్చింది. నాన్న.. నాకోసం నిలబడతాడు, నాకోసం ఏదైనా చేస్తాడు అంటూ గంపెడాశలు పెట్టుకున్న తనూజ కోసం కొన్నిసార్లు ఆటలో వెనకడుగు వేయాల్సి వచ్చింది. అటు రాము రాథోడ్‌ను కొడుకులా దగ్గరకు తీసుకున్నాడు. అతడికి ఇచ్చిన మాట ప్రకారం కెప్టెన్‌ కూడా చేశాడు.

టాప్‌ 1 అని..
కానీ, అదే సమయంలో రీతూకు సైతం సాయం చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకోలేనందుకు నానామాటలు పడ్డాడు. ఇంతలో అగ్నిపరీక్ష నుంచి వైల్డ్‌కార్డ్‌గా సరాసరి హౌస్‌లోకి వచ్చింది దివ్య. వచ్చీరావడంతోనే భరణి (Bharani Shankar)ని నెం.1 స్థానంలో నిలబెట్టింది. అందరూ తనే టాప్‌ 1 అని పైకి లేపేసరికి పొంగిపోయాడు. దివ్యను ఇంకో కూతురిగా చూసుకున్నాడు. తనకు ఎదురొచ్చినవారు ఎలిమినేట్‌ అవుతున్నారంటూ సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నాడు. 

ఆ పని చేసుంటే..
కానీ, రోజురోజుకీ తన గ్రాఫ్‌ పడిపోతుందని అర్థం చేసుకోలేకపోయాడు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, గేమ్‌ ఆడండి అని నాగార్జున పదేపదే హెచ్చరించినా దాన్ని పెడచెవిన పెట్టాడు. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న చందంగా భరణి గేమ్‌ ఆడుంటే ఇప్పటికీ టాప్‌ ప్లేస్‌లో ఉండేవాడు. కానీ బంధాలతో నోరు కట్టేసుకున్నాడు, తనకు తానే ఓ బందీ అయిపోయాడు. దీనికి తోడు భరణికి భుజం నొప్పి కూడా ఉంది. ఎలాగో వైల్డ్‌ కార్డ్స్‌ వచ్చారు కాబట్టి, ఇక  అతడితో పని లేదని భావించిన ప్రేక్షకులు అతడిని బయటకు పంపించేశారు.

చదవండి: బోరుమని ఏడ్చిన తనూజ, దివ్య.. ఆ ఒక్కడికి సారీ చెప్పిన భరణి!

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)