Breaking News

ఏడ్చేసిన సుమన్‌.. నామినేషన్స్‌లో ఎవరంటే?

Published on Mon, 11/03/2025 - 11:40

బిగ్‌బాస్‌ షో (Bigg Boss Telugu 9)లో తొమ్మిదో వారం నామినేషన్స్‌కు రంగం సిద్ధమైంది. ఫైర్‌ బ్రాండ్‌ మాధురి వెళ్లిపోవడంతో ప్రస్తుతం హౌస్‌లో 13 మంది మిగిలారు. వీరికి గతంలోని పాత బొమ్మల టాస్కే ఇచ్చారు. బజర్‌ మోగగానే వేరేవారి ఫోటో ఉన్న బొమ్మ తీసుకుని సేఫ్‌ జోన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.  ఆఖరిగా జోన్‌లో అడుగుపెట్టేవారు, వారి దగ్గరున్న బొమ్మపై ఎవరి ఫోటో ఉంటుందో వారు నామినేషన్‌ జోన్‌లోకి వస్తారు.

ఏడ్చేసిన సుమన్‌
తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో.. సంజనా (Sanjana Galrani) మాట్లాడుతూ.. నేను సోలో ప్లేయర్‌గానే ఉన్నాను. కానీ, రీతూ గేమ్‌లో డిమాన్‌ పవన్‌ సాయం చేస్తున్నాడు. అది అందరికీ కనిపిస్తుందని చెప్పింది. అది విన్న రీతూ.. మీకెలా బాండ్స్‌ ఉన్నాయో, నాకూ అలాగే హౌస్‌లో ఒక బాండ్‌ ఉంది. అది మీకు తప్పనిపిస్తే నేనేం చేయలేను అని ఇచ్చిపడేసింది. సుమన్‌ మాట్లాడుతూ.. నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి, తనూజను సేవ్‌ చేసి నేను నామినేట్‌ అవాలనుకుంటున్నా అని ఏడ్చేశాడు. అందుకు తనూజ ఒప్పుకోలేదు. సుమన్‌ (Suman Shetty) కళ్లలో నీళ్లు తిరిగేసరికి పవన్‌, కల్యాణ్‌ అతడిని ఓదార్చారు.

నామినేషన్స్‌లో ఎవరు?
మొత్తానికి ఈ వారం భరణి, సంజనా, తనూజ, రాము, సాయి, కల్యాణ్‌ నామినేట్‌ అయ్యారని తెలుస్తోంది. తనూజ.. ఇమ్మాన్యుయేల్‌ను నామినేట్‌ చేశారంటున్నారు. అది నిజమేనా? ఏమైనా మార్పులుచేర్పులున్నాయా చూడాలి! బిగ్‌బాస్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇమ్మూ నామినేషన్స్‌లో లేడు. ఇది అతడికే మైనస్‌ అవుతుంది. నామినేషన్స్‌లోకి వస్తేనే అతడి అభిమానులకు ఓట్లేయడం అలవాటవుతుంది. తనకు ఏ స్థాయిలో ఓట్లు పడతాయి? దాన్ని పెంచేందుకు ఇంకా ఎలా కృషి చేయాలన్నది ఐడియా వస్తుంది? లేదంటే టాప్‌ 2కి బదులుగా టాప్‌ 5తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

 

చదవండి: తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్‌తో మాధురి కంటతడి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)