Breaking News

పవన్‌కి రెడ్ కార్డ్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే?

Published on Sat, 11/01/2025 - 20:11

గతంతో పోలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత బిగ్‌బాస్ హౌసులో కాస్త డ్రామా కనిపిస్తోంది. ఈ వారమంతా కూడా భరణి, శ్రీజ మధ్యలో పోటీ పెట్టి రీఎంట్రీ ఎవరు ఇవ్వబోతున్నారనేది తేల్చారు. చివరకు గెలిచిన భరణి.. హౌసులోకి మళ్లీ వచ్చేశాడు. ఇక వీకెండ్ వచ్చిందంటే కచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈసారి కూడా అలానే ఒకరు బయటకెళ్లిపోయారు. కానీ ఒకరు అనుకుంటే మరొకరు ఔట్ అయ్యారట.

8వ వారం నామినేషన్స్‌లో సంజన, మాధురి,రాము, కల్యాణ్, తనూజ, రీతూ, పవన్, గౌరవ్ ఉన్నారు. వీళ్లలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయిన మాధురి, గౌరవ్.. తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చారు. దీంతో వీకెండ్ అయ్యేసరికి వీళ్లకే తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చిన్న టెన్షన్ ఏర్పడింది. తొలుత గౌరవ్ బయటకొచ్చేశాడని రూమర్స్ వచ్చాయి. కానీ ఫైనల్‌గా మాధురి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: హీరోగా లోకేశ్ కనగరాజ్.. మూవీ టీజర్ రిలీజ్)

మరోవైపు లేటెస్ట్ ప్రోమోలో మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. రీతూ-పవన్‌కి సంబంధించిన ఓ వీడియో చూపించిన హోస్ట్ నాగార్జున.. పవన్‌పై సీరియస్ అయ్యారు. ఈ వీడియోలో పవన్.. రీతూని బెడ్‌పైకి తోస్తూ కనిపించాడు. బిగ్‌బాస్ నిబంధనల ప్రకారం.. తోసేయడం, తన్నడం లాంటివి చేయకూడదు. వీడియో ప్లే చేసిన తర్వాత.. 'ఇలాంటి ప్రవర్తన మీ ఇంట్లో ఆడపిల్లలపై చేస్తే బెల్ట్ పెట్టి కొట్టేవారా కాదా ఆడియెన్స్' అని నాగ్ అడిగాడు. అలా తోయడం కరెక్ట్ కాదని ఆడియెన్స్ అనేసరికి.. 'సారీ సర్' అని పవన్ అన్నాడు.

సారీ చెబితే బిగ్‌బాస్ క్షమించడు. నీకు రెడ్ ఫ్లాగ్ తప్పదు. నీ బ్యాగ్ సర్దుకే. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్ అని నాగార్జున అన్నాడు. దీంతో పవన్ దీనంగా ముఖం పెట్టి కనిపించాడు. మరోవైపు రీతూ.. 'సార్ సార్ వద్దుసార్' అని నాగార్జునని ప్రాధేయపడుతూ కనిపించింది. అయితే ఇదంతా డ్రామా నడిపించడమే కోసమే అనిపిస్తుంది. ఎందుకంటే గత సీజన్లలో ఇలాంటి హంగామా చాలాసార్లు చూపించారు. దీంతో పవన్ బయటకెళ్లడం జరగదులే అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఆ వ్యాధితో బాధపడుతున్నా: రాజశేఖర్) 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)