Breaking News

ఈ వారం నో ఎలిమినేషన్‌.. టాప్‌ 5లో వీళ్లేనా?!

Published on Sun, 11/23/2025 - 07:47

సుమన్‌ చేసిన పొరపాటు వల్ల, తనూజ కంగారు వల్ల కెప్టెన్సీ చేతికి వచ్చినట్లే వచ్చి పోయింది. రీతూ కెప్టెన్‌గా గెలిచింది. ఇక ఈ వారమంతా ఫ్యామిలీ మెంబర్స్‌ రాగా వీకెండ్‌లో కుటుంబసభ్యులతో పాటు సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. టాప్‌ 5లో ఎవరుంటారో తమ అభిప్రాయాలు చెప్పారు. ఆ విశేషాలు శనివారం (నవంబర్‌ 22వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

జీవితంలో ముఖం చూడను
(Bigg Boss Telugu 9) తనూజతో జరిగిన గొడవ నుంచి ఇంకా బయటకు రాలేకపోతోంది దివ్య. మీకిష్టం లేకపోయినా మీ వెంటపడుతున్నానని కామెంట్స్‌తో బాధపెట్టింది. బయటకెళ్లాక జీవితంలో తన ముఖం చూడను అంది. నాగార్జున స్టేజీపైకి వచ్చి తనూజ- దివ్య గొడవ గురించి ప్రస్తావించాడు. కెప్టెన్‌ అవగానే కళ్లు నెత్తికెక్కాయా? అని తనూజకు క్లాస్‌ పీకాడు. పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అంటూ గొడవకు పునాది వేసిందే నువ్వని దివ్యను తిట్టిపోశాడు. అలా ఇద్దరికీ కాస్త గడ్డి పెట్టాక ఫ్యామిలీ మెంబర్స్‌ను స్టేజీపైకి పిలిచాడు.

తనూజ నా మనవరాలు
మొదటగా భరణి (Bharani Shankar) తల్లితో పాటు నాగబాబు కూడా స్టేజీపైకి వచ్చాడు. తనూజ (Thanuja Puttaswamy)ను మనవరాలు అని పిలిచిన భరణి తల్లి.. దివ్యను మాత్రం పరోక్షంగా జాగ్రత్త అని హెచ్చరించింది. కొడుకుపై అరవొద్దు అన్నట్లుగా సుతిమెత్తగా వార్నింగ్‌ ఇచ్చింది. వీళ్లు.. భరణి, తనూజ, సుమన్‌, ఇమ్మాన్యుయేల్‌, సంజనను టాప్‌ 5లో వరుసగా పెట్టారు. 

కల్యాణ్‌ తండ్రి గొప్ప మాటలు
తర్వాత కళ్యాణ్‌ కోసం తండ్రి లక్ష్మణ్‌రావు, తమ్ముడు బాలు వచ్చారు. కొడుకును చూసి ఎమోషనలైన తండ్రి.. నీనుంచి పదిమంది బతకాలి.. పదిమంది నుంచి నువ్వు బతక్కూడదు అంటూ గొప్ప మాటలు చెప్పాడు. కల్యాణ్‌, ఇమ్మాన్యుయేల్‌, తనూజ, రీతూ, పవన్‌ను టాప్‌ 5 పెట్టారు. అనంతరం ఇమ్మాన్యుయేల్‌ అన్నతో పాటు కమెడియన్‌ అవినాష్‌ వచ్చారు. ఇమ్మూ, తనూజ, కల్యాణ్‌, పవన్‌, రీతూని టాప్‌ 5లో పెట్టారు. అవినాష్‌ తనూజకు మహానటి, కట్టప్ప అవార్డులు ఇచ్చాడు.

టాప్‌5 చివర్లో దివ్య
తర్వాత దివ్య తాతయ్య, స్నేహితురాలు వచ్చారు. వీళ్లిద్దరూ.. ఇమ్మాన్యుయేల్‌, తనూజ, భరణి, సుమన్‌, దివ్యను టాప్‌ 5లో పెట్టారు. దివ్యను చివర్లో పెట్టిన తాతయ్య.. నువ్వింకా చాలా ఇంప్రూవ్‌ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. ఇకపోతే ఈ వారం దివ్య-తనూజ గొడవతో టీఆర్పీలు బద్ధలైపోయాయట. దీంతో బిగ్‌బాస్‌ టీమ్‌ దివ్యను ఎలిమినేషన్‌ నుంచి కాపాడేందుకు ఈ వారం నో ఎలిమినేషన్‌ అని ప్రకటించేందుకు సిద్ధమైందట! ఆ సంగతులు నెక్స్ట్‌ ఎపిసోడ్‌లో చూద్దాం..

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)