Breaking News

మీదే తప్పు.. నాగార్జునకే ఝలక్ ఇచ్చిన మాస్క్ మ్యాన్

Published on Sat, 09/13/2025 - 20:27

బిగ్‌బాస్ షోలో ఇ‍ప్పటివరకు 8 సీజన్లు జరిగాయి. ప్రతి వీకెండ్‌లోనూ వచ్చే నాగార్జున.. హౌస్‌మేట్స్ తప్పొప్పుల్ని ఎత్తి చూపుతూ వాళ్లతో మాట్లాడేవారు. చాలావరకు నాగ్ చెప్పిన దానికి వాళ్ల వైపు నుంచి సానుకూలంగా సమాధానం వచ్చేది. కొన్నిసార్లు మాత్రం హోస్ట్‌తో వాదించేవారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా నాగార్జున తనని తప్పుగా ప్రొజెక్ట్ అయ్యేలా చేస్తున్నారని మాస్క్ మ్యాన్ సీరియస్ అయిపోయాడు. దీంతో హరీశ్ vs నాగార్జున అన్నట్లు సాగింది.

(ఇదీ చదవండి: 'ఫ్రీ బర్డ్' గోల.. సంజన అలా ఎందుకు చేశావ్?)

శనివారం ఎపిసోడ్‌కి సంబంధించి ఇదివరకు ఓ ప్రోమో రిలీజ్ చేయగా అందులో సంజనకు నాగార్జున కౌంటర్స్ ఇచ్చారు. ఇప్పుడు మరో ప్రోమో రిలీజ్ చేయగా.. ఇమ్మాన్యుయేల్-హరీశ్ గొడవ గురించి మాట్లాడారు. ఇమ్ము.. సరదాకే గుండంకుల్ అని అన్నాడని ఎంతమంది అనుకుంటున్నారని అడగ్గా హౌసులోని అందరూ చేతులెత్తారు. దీంతో మాస్క్ మ్యాన్ హరీశ్‌దే తప్పు అన్నట్లు తేలింది. మరోవైపు ఇతడు.. తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి గురించి మాట్లాడిన ఓ వీడియోని స్క్రీన్ పై ప్రసారం చేయడంతో కొత్త వివాదం మొదలైంది.

ఆ వీడియోలో మాస్క్ మ్యాన్ హరీశ్.. తనూజతో పాటు ఉన్న ఇమ్మాన్యుయేల్, భరణిని ఆడవాళ్లు అని పరోక్షంగా అన్నాడు. అయితే కావాలనే తనని తప్పుగా చూపిస్తున్నారని హరీశ్.. నాగార్జుననే నేరుగా అనేశాడు. నేను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నానా అని ఆశ్చర్యపోవడం నాగ్ వంతైంది. దీంతో ఈ గొడవకు సమాధానం చెప్పలేకపోయిన హరీశ్.. షో నుంచి క్విట్(వెళ్లిపోతా) అయిపోతా అని అన్నట్లు ప్రోమోలో చూపించారు. మరి నిజంగానే మాస్క్ మ్యాన్‌ని హౌస్ నుంచి బయటకు పంపేస్తారా? లేదంటే ఈ వివాదానికి ఎలా పుల్‌స్టాప్ పెడతారో చూడాలి?

(ఇదీ చదవండి: డేంజర్‌ జోన్‌లో ఉన్నది వీళ్లే.. లక్స్‌ పాపపై ఎలిమినేషన్‌ వేటు?)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)