Breaking News

బిగ్‌బాస్‌లో తొలి వీకెండ్‌.. ఒక్కరోజులో ఇన్ని ట్విస్టులా?

Published on Sat, 09/12/2026 - 22:26

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-10లో తొలి వీకెండ్‌ ఎపిసోడ్‌ శనివారం గ్రాండ్‌గా సాగింది. ఎప్పటిలాగే హోస్ట్‌ నాగార్జున స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చి.. కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షించారు. తప్పులు చేసినవారిని ప్రశ్నిస్తూనే.. బాగా ఆడినవారిని అభినందించారు. తనదైన పంచ్‌లు, సరదా సంభాషణలతో హౌస్‌లో నవ్వులు పూయించారు.

ముందుగా కంటెస్టెంట్లతో మాట్లాడేందుకు వచ్చిన నాగార్జున కాసేపు సీరియస్‌గా కనిపించడంతో హౌస్‌మేట్స్‌ కాస్త భయపడ్డారు. ఆ తర్వాత నవ్వుతూ వారిని పలకరించారు. దీంతో ‘అలా చూడకండి సార్‌.. భయంగా ఉంది’ అంటూ కంటెస్టెంట్లు చెప్పగా.. నరేశ్‌ కూడా అదే మాట అనడంతో ‘నీకు కూడా భయం వేసిందా నరేశ్‌?’ అంటూ నాగార్జున నవ్వులు పూయించారు.

రాంప్రసాద్‌, నరేశ్‌ రివ్యూలపై..
ఇక రాంప్రసాద్‌, నరేశ్‌ కలిసి హౌస్‌లో ఎవరు ఎలా ఆడుతున్నారనే విషయంపై సరదాగా రివ్యూలు ఇచ్చారు. ఈ రివ్యూలను నాగార్జున టీవీలో వీక్షించారు. అనంతరం ఇద్దరినీ అభినందించారు. అయితే రాంప్రసాద్‌తో పోలిస్తే నరేశ్‌ తన అభిప్రాయాలను మరింత హార్ట్‌ఫుల్‌గా చెప్పాడని పేర్కొన్నారు.

‘అసలు ఆట ఇప్పుడే మొదలైంది’
అగ్నిపరీక్ష తర్వాత అసలైన మహాపరీక్ష మొదలవుతుందని బిగ్‌బాస్‌ ముందే చెప్పిన విషయాన్ని నాగార్జున గుర్తుచేశారు. 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. వారిలో కొందరు ఇప్పటికే హౌస్‌మేట్స్‌గా మారారని, మరికొందరు ఎలిమినేట్‌ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్‌లో ఉన్నారని చెప్పారు. అదే సమయంలో చరణ్‌, చైత్రలు ఇంకా సీక్రెట్‌ రూమ్‌లో ఉన్నారా? అనే అనుమానం కంటెస్టెంట్లలో ఉందని గుర్తించిన నాగార్జున.. వారితో మాట్లాడించారు. దీంతో హౌస్‌మేట్స్‌ డౌట్స్‌కు క్లారిటీ ఇచ్చారు.

( ఇదీ చదవండి: ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్‌)

షాలినీకి చరణ్‌ ధైర్యం
చరణ్‌కు నాగార్జున ఓ ప్రత్యేక అవకాశం ఇచ్చారు. హౌస్‌లో ఉన్న ఒకరితో మాట్లాడొచ్చని చెప్పారు. దీంతో చరణ్‌ షాలినీతో మాట్లాడాడు. ‘నువ్వు బాగా ఆడుతున్నావు.. అలాగే ఆడు’ అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత చైత్రకు కూడా ఇదే అవకాశం ఇచ్చారు. ఆమె ముకేశ్‌తో మాట్లాడింది. ‘నువ్వు చెప్పిన మాట విని ఉంటే బాగుండేది’ అంటూ చైత్ర చెప్పింది. అనంతరం రోహిత్‌ ఆటతీరుపై తన అసహనాన్ని వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: ‘స్పిరిట్‌‘పై విమర్శలు చేసే దమ్ము ఉందా’

ముగ్గురికి మిల్క్‌షేక్‌లు
ముగ్గురు హౌస్‌మేట్స్‌ రోహిత్‌, రాంప్రసాద్‌, టెంపర్‌ వంశీ బాగా ఆడుతున్నారని మెచ్చుకున్న బిగ్‌బాస్‌.. వారికి మిల్క్‌షేక్‌లు పంపించా. అయితే వారు తాగిన గ్లాసులను నాగార్జునే కడిగారు. దీనిపై నాగార్జున మాట్లాడుతూ.. ‘ఏ పని చిన్నది కాదు.. ఏ పని తక్కువది కాదు. అలాంటి ఆలోచన ఉంటే ఇక్కడ ఉండొద్దు’ అంటూ క్లాస్‌ తీసుకున్నారు. అనంతరం  మిగిలిన 11 మంది ఇంకా రిస్క్‌లోనే ఉన్నారని నాగార్జున తెలిపారు. వారిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ప్రేక్షకుల ఓటింగ్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

త్రిగుణ్‌, రోహిత్‌ తీరు అసహనం..
ఆ తర్వాత ముకేశ్‌, త్రిగుణ్‌, వర్షిణిలను గార్డెన్‌ ఏరియాలోని పసుపు లైన్‌ దగ్గర నిల్చోమని బిగ్‌బాస్‌ ఆదేశించారు. వీరిలో ఒకరు ప్రేక్షకుల ఓటింగ్‌ ప్రకారం హౌస్‌మేట్‌గా మారబోతున్నారని నాగార్జున తెలిపారు. చివరికి నాలుగో హౌస్‌మేట్‌గా త్రిగుణ్‌ ఎంపికయ్యాడు. రోహిత్‌, త్రిగుణ్‌ ప్రవర్తనపై నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. రోహిత్‌కు క్షమాపణ చెప్పాలని త్రిగుణ్‌ను ఆదేశించారు. అంతేకాదు.. స్విమ్మింగ్‌ పూల్‌ చుట్టూ టైర్‌ను చేతితో ఎత్తుకుని తిరగాలని పనిష్‌మెంట్‌ ఇచ్చారు. ‘ఎంగిలి కప్పులు కడగాలి’ అనే మాట విషయంలోనూ రోహిత్‌కు క్షమాపణలు చెప్పాలని సూచించారు. అలాగే బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేయకపోవడంపై రోహిత్‌ను నాగార్జున ప్రశ్నించారు. ఇకపై బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్‌లను అందరూ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమిత

దేబ్జానీకి నాగార్జున ప్రశంసలు
హౌస్‌లో తెలుగులో మాట్లాడుతున్న దేబ్జానీని నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు. బాగా ఆడుతున్నావంటూ ప్రశంసించారు. మరోవైపు రాంప్రసాద్‌ నవ్వించాలనే ప్రయత్నంలో కొన్ని పదాలు ఉపయోగిస్తున్న తీరును కంట్రోల్‌ చేసుకోవాలని సూచించారు. ఇకపై రాంప్రసాద్‌ అలా మాట్లాడకుండా చూసుకునే బాధ్యతను నరేశ్‌ తీసుకోవాలని సరదాగా చెప్పారు.

షాలినీ చేసిన ఓ కామెంట్‌ నేపథ్యంలో రాంప్రసాద్‌ను అతడి మొదటి సంపాదన ఎంత అని నాగార్జున అడిగారు. దానికి రాంప్రసాద్‌ తన మొదటి సంపాదన రూ.500 అని చెప్పాడు. అనంతరం షాలినీకి సారీ చెప్పడం కోసం  500 సార్లు sorry అని రాయాలని  రాంప్రసాద్‌కు పనిష్‌మెంట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా బేబ్‌జానీ సరదాగా స్పందిస్తూ.. ‘నీ మొదటి సంపాదన రూ.20 అని చెప్పాల్సింది’ అంటూ నవ్వులు పూయించింది.

పోటీ మరింత ఆసక్తికరంగా..
ఆ తర్వాత కంటెస్టెంట్ల మనసులోని మాట తెలుసుకునేందుకు నాగార్జున ప్రయత్నించారు. మీకు నచ్చిన ఒకరి పేరు, నచ్చని ఒకరి పేరు చెప్పాలంటూ అడగడంతో ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను వెల్లడించారు. చివర్లో మరో కీలక ప్రకటన చేశారు. లాస్ట్‌ హౌస్‌మేట్‌గా దేబ్జానీ ఎంపికైనట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో తొలి వీకెండ్‌లోనే బిగ్‌బాస్‌ హౌస్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో రిస్క్‌లో ఉన్న వారిలో ఎవరు సేఫ్‌ అవుతారు? ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు? అన్నది ఉత్కంఠగా మారింది.

Videos

10 వేలతో 9 లక్షల లాభం.. HDFC Flexi Cap Fund రికార్డ్ రిటర్న్స్

జగన్ లేకపోతే నేను లేను.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న బద్దుకొండ అప్పలనాయుడు

2లక్షలు వసూలు చేసిన హిజ్రాలపై కేసు

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)