Breaking News

బిగ్‌బాస్‌లో కొత్త ట్విస్ట్‌.. నామినేషన్స్‌లో ఉన్నవారికి..

Published on Thu, 10/08/2026 - 10:09

బిగ్‌బాస్ తెలుగు 10లో రోజురోజుకూ ఆట మరింత రసవత్తరంగా మారుతోంది. నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ఎలిమినేషన్ భయం వెంటాడుతుండగా.. తాజాగా బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌తో హౌస్‌లో పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఈసారి కేవలం ప్రేక్షకుల ఓటింగ్ మాత్రమే కాకుండా.. టాస్కుల్లో గెలుపు కూడా కంటెస్టెంట్లను సేఫ్ చేసే తాళంగా మారింది. దీంతో గెలిచి తీరాలనే పట్టుదలతో కంటెస్టెంట్లు బరిలోకి దిగారు. ఈ క్రమంలో అపూర్వ, షాలినీ మధ్య మాటల యుద్ధం జరగడంతో పాటు.. సుధీర్ పెళ్లి టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. మరి నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


బిగ్‌బాస్ కీలక హెచ్చరిక..
నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ కీలక హెచ్చరిక చేశాడు. ఇంట్లోకి కొత్త కంటెస్టెంట్లు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే నామినేషన్స్‌లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. దీంతో హౌస్‌లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. నామినేషన్స్‌లో ఉన్న దేబ్జానీ, వంశీ, సుధీర్, వర్షిణి ఫొటోలను ఎండిపోయిన చెట్టుపై ఉంచారు. మరోవైపు వికసించిన చెట్టును ఏర్పాటు చేశారు. ఆటల్లో గెలిచి ఎండిపోయిన చెట్టు నుంచి వికసించిన చెట్టు మీదకు చేరితేనే సేఫ్ అవుతారని బిగ్‌బాస్ ప్రకటించాడు. ఈసారి ఎలిమినేషన్ రెండు తాళాలపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. అందులో ఒక తాళం ప్రేక్షకుల చేతిలో ఉంటే.. మరో తాళం ఈ టాస్కుల చేతిలో ఉంటుందని వివరించాడు.

దీంతో కంటెస్టెంట్లను జంటలుగా విడిపోయి ఆట ఆడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. అమన్-త్రిగుణ్, రోహిత్-షాలినీ, అపూర్వ-చరణ్, నరేష్-రాంప్రసాద్, ముకేశ్-ఝాన్సీ జంటలుగా బరిలోకి దిగారు. ఈ ఆటకు వర్షిణి, సుధీర్ సంచాలకులుగా వ్యవహరించారు.

అపూర్వ, షాలినీ మధ్య గొడవ
ఈ టాస్క్‌లో అపూర్వ, చరణ్ జోడీ మొదట విజయం సాధించింది. మరోవైపు రోహిత్, షాలినీ ఓటమి పాలయ్యారు. అయితే అంతకుముందు రోహిత్‌తో కలిసి ఆడాలని అపూర్వ కోరగా.. అందుకు అతడు అంగీకరించలేదు. దీంతో తనను వారి గ్రూపులో సరిగ్గా స్వాగతిస్తున్నట్లు కూడా అనిపించడం లేదని అపూర్వ అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో షాలినీ, అపూర్వ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో త్రిగుణ్ పేరు కూడా చర్చలోకి వచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్తా పెద్ద గొడవగా మారింది. దీంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది.

(ఇదీ చదవండి: నానా పటేకర్‌.. అందుకే ఆయన ఎంతో ప్రత్యేకం: ప్రధాని మోదీ)

సుధీర్ పెళ్లి టాపిక్‌తో మరో గొడవ
ఆ తర్వాత సుధీర్‌తో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు గతంలో అపూర్వ చెప్పిన మాటలు చర్చకు వచ్చాయి. రాంప్రసాద్ ఈ విషయాన్ని ప్రస్తావించడంతో.. తాను సరదాగా ఆ మాట చెప్పానని అపూర్వ క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ మాటలపై చర్చ కొనసాగడంతో ఆమె తీవ్రంగా ఎమోషనల్ అయింది. తాను సరదాగా అన్న మాటలను సీరియస్‌గా తీసుకుని తనను ఇబ్బంది పెడుతున్నారని అపూర్వ కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పటి వరకు ఏడ్చానని.. ఇకపై తాను ఏడిపిస్తానంటూ ఘాటుగా స్పందించింది.

నరేష్ కామెడీ.. టైటానిక్
మరోవైపు నరేష్ తనదైన శైలిలో సామ్రాజ్యం, రాజు అంటూ ఓ కథ చెప్పి ఇంటి సభ్యులను నవ్వించాడు. గొడవల మధ్య కాస్త వినోదం పంచే ప్రయత్నం చేశాడు. షాలినీ, అపూర్వ మధ్య వాగ్వాదం కొనసాగుతున్న సమయంలోనే నరేష్, వర్షిణి కలిసి టైటానిక్ సన్నివేశాన్ని చేసి అందరినీ నవ్వించారు. ఇలా ఓ వైపు నామినేషన్స్ టాస్క్‌తో ఉత్కంఠ.. మరోవైపు అపూర్వ, షాలినీ గొడవతో వేడి.. మధ్యలో నరేష్, వర్షిణి కామెడీతో 31వ రోజు ఎపిసోడ్ సాగింది. 

(ఇదీ చదవండి: నానా పటేకర్ మృతి.. ఎన్టీఆర్‌ ఎమోషనల్ పోస్ట్)

 

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)