Breaking News

లక్కీ ఛాన్స్ కొట్టేసిన లారెన్స్.. ముగ్గురు బ్యూటీస్!

Published on Wed, 06/11/2025 - 08:42

సినిమాటిక్ యూనివర్స్ అనగానే గుర్తొచ్చే పేరు లోకేశ్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్ సినిమాలని ఒకదానికొకటి లింక్ చేసిన ఇతడు.. ఎల్‌సీయూ సృష్టించాడు. ప్రస్తుతం రజనీకాంత్‌తో 'కూలీ' తీస్తున్నాడు. ఇది ఆగస్టులో రిలీజ్ కానుంది. ఓవైపు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు నిర్మాతగానూ పలు చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటే 'బెంజ్'. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పుడు క్రేజీ రూమర్ ఒకటి వినిపిస్తోంది.

సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. లోకేశ్ ఇప్పటివరకు తీసిన చిత్రాల్లోనూ హీరోయిన్లు కనిపించేది కూడా తక్కువే అని చెప్పొచ్చు. కానీ 'బెంజ్'లో మాత్రం ఏకంగా ముగ్గురు భామల్ని తీసుకున్నారట. వాళ్లలో సంయుక్త, ప్రియాంక మోహన్ ఇప్పటికే ఖరారు కాగా.. మడోన్నా సెబాస్టియన్‌ని కూడా తీసుకోవాలని చూస్తున్నారట.

(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌తో?)

సంయుక్త, ప్రియాంక హీరో సరసన నటిస్తారని.. మడోన్నా మాత్రం విలన్ వాల్టర్‌గా చేస్తున్న నివీన్ పౌలీ పక్కన కనిపించబోతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. రీసెంట్‌గా 'బెంజ్' విలన్‌కి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేసి నివీన్ పౌలీ పాత్రని పరిచయం చేశారు. లోకేష్ యూనివర్స్‌లో ఈ మూవీ కూడా భాగమేనని చెప్పుకొచ్చారు. మరి ఎలా ఏ సినిమాతో లింక్ చేస్తారనేది ఇంకా సస్పెన్స్. ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.

లోకేశ్ ప్రస్తుతం 'కూలీ' తీస్తున్నాడు. దీని తర్వాత 'ఖైదీ 2' ఉంటుంది. అలానే రోలెక్స్, విక్రమ్ 2 చిత్రాల్ని కూడా తీస్తానని ఇదివరకే చెప్పాడు. అయితే కొన్నిరోజులుగా ఆమిర్ ఖాన్‌తో ఓ సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. చూడాలి మరి వీటిలో ఏది ముందు మొదలవుతుందో?

(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)