ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ కామెడీ సినిమా

Published on Sat, 09/13/2025 - 19:36

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. కూలీ, పరదా, సయారా, సు ఫ్రమ్ సో.. ఇలా చాలా హిట్ చిత్రాలు ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. వీటితో పాటు ఓ తెలుగు హారర్ కామెడీ మూవీ కూడా రీసెంట్‌గానే డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మ వల్ల వచ్చే ఇబ్బందులు అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?

గత కొన్నేళ్లలో తెలుగులో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్.. లీడ్ రోల్ చేసిన సినిమా 'బకాసుర రెస్టారెంట్'. ఆగస్టు తొలివారం థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ దక్కించుకుంది. అలాంటిది నెల తిరగకుండానే అమెజాన్ ప్రైమ్‍‌లోకి వచ్చేసింది. ఈ సోమవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాంటిది ఈ చిత్రం ఇప్పుడు సదరు ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది.

(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) 

'బకాసుర రెస్టారెంట్' విషయానికొస్తే.. పరమేశ్వర్ (ప్రవీణ్) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఉద్యోగం చేస్తుంటాడు కానీ వ్యాపారం చేయాలని కోరిక. దీంతో రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్ ఛానెల్ మొదలుపెడతాడు. ఓ దెయ్యంపై తొలి వీడియో చేస్తే అది తెగ వైరల్ అవుతుంది. అలాంటిదే మరో వీడియో చేసేందుకు ఓ పాత బంగ్లాకు తన స్నేహితులతో కలిసి వెళ్తాడు. అక్కడ కనిపించిన పుస్తకంతో క్షుద్రపూజ చేస్తాడు. కట్ చేస్తే బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకొస్తుంది.

బక్క సూరి ఆత్మతో పరమేశ్వర్, అతడి స్నేహితులు ఆడుకునే ప్రయత్నం చేయగా.. పరమేశ్వర్‌ స్నేహితుడి శరీరంలోకి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. దీనికి ఆకలికి ఎక్కువ. ఆ ఆత్మని బయటకు పంపేందుకు పరమేశ్వర్‌ గ్యాంగ్‌ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అసలు ఆత్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'ఫ్రీ బర్డ్' గోల.. సంజన అలా ఎందుకు చేశావ్? ప్రోమో రిలీజ్)

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)