ఎందుకు మీకు అంత భయం.. విడుదల రజినిని ఆపేసిన పోలీసులు
Breaking News
సగం వయసున్న వాళ్లతో డేటింగ్.. నేను కూడా రెడీ
Published on Fri, 09/19/2025 - 12:12
కెరీర్ పోతుందేమోనని భయంతో చాలామంది హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోరు. కానీ ఓ దశ వచ్చిన తర్వాత మాత్రం బిజినెస్‌మ్యాన్ లేదంటే ఎవరో ఒకరిని వివాహం చేసుకుని సెటిలైపోతుంటారు. కానీ కొందరు మాత్రం ఏజ్ పెరిగిపోతున్నా సరే సింగిల్‌గానే ఉండిపోతుంటారు. అలాంటి వారిలో హీరోయన్ అమీషా పటేల్ ఒకరు. ఈ బ్యూటీ 50 ఏళ్లు. అయినా సరే గ్లామర్ విషయంలో తగ్గేదే లే అంటోంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాల్ని చెప్పుకొచ్చింది.
'నన్ను పెళ్లి చేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. అయితే వాళ్లందరూ వివాహం తర్వాత నటన మాసేసి పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని కండీషన్ పెట్టారు. ఇలాంటవన్నీ నచ్చక చాలామంది ప్రపోజల్స్ రిజెక్ట్ చేశాను. ప్రేమించే వ్యక్తులు ఎప్పుడూ కెరీర్‌లో రాణించేందుకు ప్రోత్సాహం ఇవ్వాలి. సినిమాల్లోకి రాకముందే నేను ఒకరితో సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. మా ఇద్దరి కుటుంబ నేపథ్యం, ఇష్టాయిష్టాలు కలిశాయి. అయితే నేను నటిగా మారతానని చెప్పాను. పబ్లిక్ లైఫ్‌లో ఉండే వ్యక్తి పార్ట్‌నర్‌గా వద్దని అతడి చెప్పేసరికి ప్రేమని వదులుకున్నాను. కెరీర్‌ని ఎంచుకున్నాను'
(ఇదీ చదవండి: కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. దీపికకు నాగ్ అశ్విన్ కౌంటర్)
'అలా అని నేనేమి పెళ్లికి వ్యతిరేకం కాదు. సరైన వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికీ నాకు మంచి కుటుంబాల నుంచి సంబంధాలు వస్తూనే ఉన్నాయి. తనలో సగం వయసున్న వారు కూడా డేటింగ్‌కి రమ్మని పిలుస్తున్నారు. దానికి నేను కూడా రెడీ. కాకపోతే మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు' అని అమీషా పటేల్ చెప్పుకొచ్చింది.
'కహోనా ప్యార్ హై' అనే హిందీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమీషా.. తెలుగులోకి 'బద్రి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మహేశ్ బాబు 'నాని', ఎన్టీఆర్ 'నరసింహుడు', పరమవీరచక్ర తదితర చిత్రాల్లో నటించింది. కొన్నేళ్లపాటు నటనకు దూరంగా ఉన్న ఈమె.. 2023లో వచ్చిన 'గదర్ 2' మూవీతో హిట్ అందుకుంది. గతేడాది 'తౌబా తేరా జల్వా' అనే సినిమాలో చివరగా కనిపించింది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తోంది.
(ఇదీ చదవండి: హీరో శర్వానంద్ దంపతులు విడిపోయారా?)
Tags : 1