Breaking News

'పొన్నియిన్ సెల్వన్' నటుడి పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?

Published on Sun, 07/13/2025 - 14:55

మరో ప్రముఖ నటుడు పెళ్లి చేసుకున్నాడు. తమిళంలో 'పొన్నియిన్ సెల్వన్', 'థగ్ లైఫ్' తదితర చిత్రాల్లో నటించిన ఇతడు.. ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. ఆర్కిటెక్ట్ జయశ్రీ చంద్రశేఖరన్‌తో ఏడడుగులు వేశాడు. ఆదివారం ఉదయం ఈ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరై నూతన వధూవరుల్ని దీవించారు. పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో మోసపోయిన యాంకర్ అనసూయ)

చెన్నైలో పుట్టి పెరిగిన అర్జున్ చిదంబరం.. థియేటర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా 2015లో వచ్చిన 'మూణే మూణు వార్తై' అనే సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత రమ్, నేర‍్కొండ పార్వై, తీవిరమ్, పొన్నియిన్ సెల్వన్, అనీతి, కొలాయి, రత్తం, థగ్ లైఫ్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అమెరికా మాప్పిలై, ఆటో శంకర్, బిహైండ్ కోజ్డ్ డోర్, అద్ధం, ద విలేజ్ వెబ్ సిరీసుల్లోనూ కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టేశాడు. ఇక పెళ్లి కూతురు జయశ్రీ చంద్రశేఖర్ విషయానికొస్తే ఈమెకు సినీ పరిశ్రమతో సంబంధం లేదు. ప్రస్తుతం ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోంది. వీళ్లిద్దరిది ప్రేమ వివాహమా? పెద్దల కుదిర్చిన పెళ్లి? అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: అమ్మ మీద ప్రేమ.. ఆ హీరోపై అభిమానం ఎప్పటికీ తగ్గదు: కిరీటి)

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)