Breaking News

ఓటీటీలో ట్రెండింగ్ సినిమా.. డైలాగ్స్ ఆడియో రిలీజ్

Published on Tue, 07/22/2025 - 12:40

గత నెలలో థియేటర్లలో రిలీజైన '8 వసంతాలు' సినిమా.. కొందరికి నచ్చింది, ఇంకొందరికి నచ్చలేదు. ప్రేమకథ బాగుంది, డైలాగ్స్‌ సూపర్ అని కొందరు అంటుంటే.. మరికొందరేమో సీరియల్‌లా ఉందని అంటున్నారు. సరే ఇవన్నీ పక్కనబెడితే డైలాగ్స్, వాటిలోని సాహిత్యం చాలామందిని ఆకట్టుకున్నాయి. కొందరు బాగా కనెక్ట్ అయ్యారు కూడా. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు జ్యూక్ బాక్స్ వీడియోని రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కన్నప్ప'.. డేట్ ఫిక్సయిందా?)

థియేటర్లలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమా నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. తర్వాత ట్రెండింగ్‌లోకి కూడా వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని బాగానే చూస్తున్నారు. కొందరు విజువల్స్, డైలాగ్స్‌కి ఫిదా అయిపోతున్నారు. ఇదే చిత్రంలోని 'అందం అంటే గుణం', 'సుఖాలే కాదు కలలు కూడా పంచుకోవాలి' ,'ఎవరి తలరాతలు వాళ్లే రాసుకోవాలి', 'ఎవరి తుపానులు వాళ్లకుంటాయి లోపల'.. ఇలా పలు సంభాషణలు అచ్చ తెలుగులో ఉంటూ మనసుని దోచేస్తున్నాయి. ఇలా దాదాపు 12 డైలాగ్స్‌ని ఆడియో రూపంలో యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉంటే వినేయండి.

'8 వసంతాలు' విషయానికొస్తే.. శుద్ధి అయోధ్య(అనంతిక) మార్షల్ ఆర్ట్స్, కరాటే నేర్చుకుంటూ ఉంటుంది. తండ్రి దూరమైన బాధల్లోంచి రాసిన పుసక్తంతో గొప్ప రచయిత అవుతుంది. నదిలా ప్రవహిస్తున్న ఈమె జీవితంలోకి వరుణ్ (హను రెడ్డి) వస్తాడు. అప్పటివరకు తన ప్రపంచంలో తాను బతుకుతున్న శుద్దిని ప్రేమలోకి దించుతాడు. కొన్నాళ్ల తర్వాత తన స్వార్థం చూసుకుని శుద్ధిని నడిరోడ్డున వదిలేసి వెళ్లిపోతాడు. అప్పుడు ఈమె ఏం చేసింది? శుద్ధి జీవితంలో సంజయ్ (రవి దుగ్గిరాల) పాత్రేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: వరలక్ష‍్మికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)