Breaking News

చాలా భయపడిపోయా.. స్మిత్‌ మచ్చార్‌ భార్య ఎమోషనల్‌

Published on Fri, 10/02/2026 - 16:47

దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్' (flydubai) విమాన ఘటన తరువాత  భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యసాహసాలు గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 9/11 తరహా దాడిని అడ్డుకున్న  వీరుడని, 180 మంది ప్రాణాలను  రక్షించిన రియల్‌ హీరో అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్ స్మిట్‌ భార్య సోనల్ మచ్చార్  తొలి స్పందన వైరల్‌ గా మారింది.

తన భర్త, భారతీయ మచ్చార్‌పై జరిగిన దాడి గురించి తెలిసిన భయంకరమైన క్షణాన్ని సోనాల్  మచ్చర్ గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన తమ కుటుంబంపై కలిగించిన మానసిక క్షోభ గురించి, అలాగే ఆ భయంకరమైన సంఘటన సమయంలో తన భర్త చూపిన ధైర్యంపై గర్వంగా ఫీలవుతున్న వైనాన్ని కూడా సోనాల్ వెల్లడించారు. అలాగే  ప్రధానమంత్రి మోదీ స్పందనపై కూడా  ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.

CNN-News18తో మాట్లాడుతూ ఫ్లైదుబాయ్ కాక్‌పిట్ దాడి గురించి తెలుసుకున్నప్పుడు తీవ్ర ఆందోళన చెందానంటూ సోనాల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇది విన్న తర్వాత  తన కాళ్ల కింద భూమి కంపించి పోయిందంటూ అనుభవించిన దిగ్భ్రాంతిని, భయాన్నివివరించారు. దాడి జరిగింది అనగానే అతని పరిస్థితి ఎలా ఉందో అర్థంకాక చాలా కుంగిపోయానంటూ ఆ ఆందోళనకరమైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. అసలు ఎలా స్పందించాలో అర్థం చేసుకునే మానసిక స్థితి కూడా తనకు లేదన్నారు. ఆ క్లిష్ట సమయంలో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు తోడుగా ఉండటం , భారతీయ అధికారుల నుండి అందిన సమాచారం తనకు ఎంతో ఊరటనిచ్చాయని ఆమె తెలిపారు. ఈ  క్లిష్ట సమయంలో  తన చుట్టూ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉండటంతో అంతా సవ్యంగానే ఉందనే భరోసా కలిగింది. ఆయన పరిస్థితి నిలకడగా ఉందనే వార్తలు రావడం మొదలవ్వడం ఊరటనిచ్చిందన్నారు.

ఇదీ చదవండి: 12 ఏళ్ల కొడుకు గొంతు నులిమి? కష్టాల్లో ప్రముఖ నటి

అబుదాబిలోని ఆసుపత్రిలో గురువారం తన భర్తను కలుసుకునే దాకా తన ఆందోళన తగ్గలేదని చెప్పారు.   యూఏఈ (UAE) వైద్యులు , సైనిక వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చాలా మంచి చికిత్స అందుతోంది. కోలుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆయన త్వరగా ఇంటికి తిరిగి రావాలని అందుకు తాను చేయాల్సిన కృషినంతా  చేస్తానన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కెప్టెన్ మచ్చర్‌తో మాట్లాడాలని కోరుకుంటున్నారన్న వార్తల గురించి అడిగినప్పుడు, తన భర్త పూర్తిగా కోలుకున్న తర్వాత వారిద్దరి మధ్యే నేరుగా సంభాషణ జరగాలని సోనాల్ సూచించారు.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్మిట్‌ ప్రస్తుతం కోలుకుంటున్నారు. మరోవైపు అరెస్టుఅయిన కో-పైలట్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తరలించారు. 

ఇదీ చదవండి: అన్ని ఉరిశిక్షలకు బ్రేక్‌ : ప్రాణాలతో బైటపడిన క్రిస్టా ఇపుడెలా ఉంది?

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)