Breaking News

‘మీ ఎకానమీని కూల్చేస్తాం’.. భారత్‌, చైనాలకు అమెరికా వార్నింగ్‌

Published on Tue, 07/22/2025 - 15:16

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్ధికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) సభ్యుడు లిండ్సే గ్రాహం భారత్‌, చైనాతో పాటు ఇతర దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ధర తక్కువగా ఉందని రష్యా వద్ద క్రూడాయిల్‌ను కొనుగోలు చేయాలని చూస్తే మీ ఆర్ధిక వ్యవస్థను నిట్ట నిలువునా కూల్చేస్తామని ఆయా దేశాలకు వార్నింగ్‌ ఇచ్చారు.

ఇంతకు ముందు గ్రాహం రష్యా నుంచి ఆయా ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం టారిఫ్‌ విధించాలనే ప్రతిపాదనలు తెచ్చారు. ఈ క్రమంలో మరోసారి టారిఫ్‌ ధరల్ని ప్రస్తావిస్తూ ఆయా దేశాలపై విమర్శలు గుప్పించారు. 

ఫాక్స్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘రష్యా వద్ద తక్కువ ధరకే ఆయిల్‌ దొరుకుతుందని కొనుగోలు చేస్తున్న బ్రెజిల్‌,చైనాతో పాటు భారత్‌కు నేను చెప్తున్నది ఒకటే. కీవ్‌ వద్ద ఆయిల్‌ కొనుగోలు చేస్తున్న దేశాలతో ఈ యుద్ధం(టారిఫ్‌) కొనసాగుతుంది. ఈ యుద్ధంలో సంబంధిత దేశాల్ని చీల్చి చెండాడుతాం. ఆర్ధిక వ్యవస్థను కూల్చేస్తామని పునరుద్ఘాటించారు.  

మీరు (భారత్‌,చైనా, బ్రెజిల్) చేస్తున్నది రక్తపాతం. ఎవరైనా అతన్ని ఆపే వరకు అతను (పుతిన్) ఆగడు అంటూనే.. రష్యాపై ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగారు. ట్రంప్‌తో ఆటలాడుకోవాలని చూస్తే ప్రమాదాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే. మీ చేష్టల ఫలితంగా మీ దేశ ఆర్ధిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ధ్వజమెత్తారు.  

కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తప్పుబడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధాన్ని ఆపేలా చర్చలకు రావాలని ట్రంప్‌.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆదేశించారు. ఈ బెదిరింపుల్ని రష్యా ఖండించింది. అమెరికా మాపై ఎలాంటి ఆంక్షలు విధించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)