Breaking News

మళ్లీ యుద్ధమా? ట్రంప్‌ వ్యాఖ్యలతో చమురు ధరలు భగ్గు!

Published on Wed, 07/08/2026 - 18:02

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ అవగాహనా ఒప్పందం (MoU) ముగిసిందని, ఇకపై ఎలాంటి చర్చలు ఉండవంటూ ప్రకటించారు.  మరొకవైపు ఇరాన్ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో, టర్కీలోని అంకారాలో జరుగుతున్న నాటో (NATO) సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. తాము ఇరాన్‌కు చెందిన అత్యంత ప్రమాద కరమైన వ్యక్తులపై శక్తివంతమైన దాడులు చేశాం. వాళ్లు దుర్మార్గులు, మానసిక రోగులంటూ దుమ్మెత్తి పోశారు. అంతేకాదు ఇరాన్‌ను పూర్తిగా అణ్వాయుధ రహిత దేశంగా (Denuclearisation) మారుస్తామని ట్రంప్‌ హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఆమీర్‌ భార్య గౌరి బ్రైడల్‌ లుక్‌ : 'పఠానీ హార్' విశేషాలు తెలుసా?

ఇది  ఇలా ఉంటే  ట్రంప్‌ వ్యాఖ్యల ప్రభావం గ్లోబల్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లలో సెన్సెక్స్ సుమారు 1,506 పాయింట్లు, అంటే 1.93శాతం పతనమై, 76,673.86 వద్దకు చేరగా, నిఫ్టీ 50 కూడా 461 పాయింట్లు 1.89శాతం నష్టపోయి 23,937.65దిగువకు పడిపోయింది.  ఫార్మా, మెటల్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు నష్టాల్లో నడిచాయి.

చమురుపై  ప్రభావం
ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు మళ్లీ ఆకాశంవైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒకేసారి 5 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 5.3  శాతం ఎగిసి 78.09 డాలర్ల స్థాయిని అధిగమించగా, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ 5.4 శాతం పెరిగి 74.23 డాలర్ల వద్దకి చేరుకుంది.

ఇదీ చదవండి: రెడ్‌ బెనారసీ డ్రెస్‌లో పార్టీ లుక్‌.. తొలిసారి ఇలా అన్షులా!

స్పెయిన్‌పై ట్రంప్ ఆగ్రహం.. నాటోపై అసంతృప్తి
ఇరాన్‌పై సైనిక చర్యల కోసం అమెరికాకు తమ సైనిక స్థావరాలను, వైమానిక మార్గాన్ని ఉపయోగించు కోవడానికి స్పెయిన్ నిరాకరించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. స్పెయిన్‌ను నాటోలో ఒక దారుణ మైన భాగస్వామిగా అభివర్ణిస్తూ, ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను నిలిపివేయాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌ను ఆదేశించారు. ఉగ్రవాదానికి పెద్ద పీట వేసే ఇరాన్ విషయంలో నాటో కూటమి తమకు మద్దతుగా నిలబడటం లేదని, గ్రీన్‌లాండ్ విషయంలో కూడా నాటో ప్రవర్తన తనకు నచ్చలేదని ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి: యువ క్రికెటర్‌ బలి : ఇంత ప్రమాదమా ఈ వ్యాధి? లక్షణాలేంటి?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)