Breaking News

గ్రీన్‌ సిగ్నల్‌ : హోర్ముజ్ గుండా నౌకలు అలా వెళ్లవచ్చు!

Published on Sat, 06/20/2026 - 17:23

పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్తతల వల్ల ఇరాన్ హార్మూజ్ జలసంధిమూసివేతతోఅంతర్జాతీయ చమురు సంక్షోభం ఏర్పడింది. అయితే ఈ విషయంలో  అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత, తాజాగా సముద్ర సమాచార సంస్థ  జాయింట్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (JMIC) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 

ప్రపంచ రవాణాకు కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (హోర్ముజ్ జలసంధి)లోని దక్షిణ మార్గం గుండా నౌకలు పగలap రాత్రి తమ ట్రాన్స్‌పాండర్ సిగ్నల్స్ (AIS) ఆన్ చేసుకుని  ప్రయాణించవచ్చని తెలిపింది. అంతకు ముందు అమెరికా సైన్యం నౌకలు తమ ట్రాన్స్‌పాండర్లను ఆపివేసి, డార్క్‌గా కేవలం రాత్రి వేళల్లోనే ప్రయాణించాలని సూచించిన సంగతి తెలిసిందే. JMIC తాజా ప్రకటన ప్రకారం ఇక నౌకలు తమ రేడార్లు, రన్నింగ్ లైట్లు, VHF రేడియో కమ్యూనికేషన్లను సాధారణంగా వాడుకుంటూ ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఈ మార్గంలో వెళ్లే నౌకలు అమెరికా నావికాదళ విభాగానికి (NCAGS) సమాచారం అందించడం తప్పనిసరి కాదు, కానీ సంప్రదిస్తే మంచిదని  సూచించింది.

ఇదీ చదవండి: చైనాకు కౌంటర్‌ : రూ. 1.5 లక్షల కోట్ల భారత్ సియాంగ్ ప్రాజెక్ట్

భద్రతా హెచ్చరికలు
ఈ జలసంధిలో మైన్లు (Mines) ఉండే అవకాశం ఉందని, వాటిని తొలగించే ప్రక్రియలు జరుగుతున్నాయని, అందువల్ల నౌకలు జాగ్రత్తగా ఉండాలని JMIC హెచ్చరించింది. అయితే దక్షిణమార్గంలో మైన్లు లేవని అమెరికా నావికాదళం గతంలోనే ప్రకటించింది.

కాగా ఫిబ్రవరి చివరిలో యుద్ధం ప్రారంభమైన తరువాత ఇరాన్‌ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ, హోర్ముజ్ జలసంధిగుండా వెళ్లే నౌకలు తమ అనుమతి తీసుకోవాలని ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. ఇది భవిష్యత్తులో టోల్ వసూళ్లపై వివాదానికి దారి తీయ వచ్చనే ఆందోళన నెలకొంది. 

ఇదీ చదవండి: ఐదేళ్లు లివిన్‌, ఇపుడు రేప్‌ అంటే? కేసు కొట్టేసిన హైకోర్టు

60 రోజుల వ్యవధిలో అవగాహన ఒప్పందంలోని వివాదాస్పద వివరాలను అమెరికా, ఇరాన్‌లు పరిష్కరించు కోగలవా అనే దానిపై కూడా సందేహాలు తలెత్తాయి. దీనికి తోడు  తదుపరి చర్చల కోసం స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన సమావేశం రద్దవ్వడం, వాషింగ్టన్ హెచ్చరికలను లెక్కచేయకుండా ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌పై దాడి చేయడం వంటి పరిణామాలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. హోర్ముజ్ ప్రాంతంలో భద్రతా ముప్పు స్థాయిని 'మితమైనది'గా JMIC ప్రస్తుతం అంచనా వేస్తోంది. ఒప్పందం కుదరడానికి ముందున్న 'గణనీయమైన' స్థాయితో పోలిస్తే ఇది మెరుగైనదే.

ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్‌ : అమెరికన్‌ మహిళ సంబరం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)