Breaking News

పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. వెనెజువెలా అధ్యక్షుడి తరహాలోనే..!

Published on Sat, 01/10/2026 - 00:05

పాకిస్తాన్‌ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను కిడ్నాప్ చేయాలని కోరారు. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడిని ఎత్తుకెళ్లిన తరహాలోనే నెతన్యాహును కూడా అపహరించాలని ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పాటు టర్కీ కూడా ఈ పని చేయగలదని ఇజ్రాయెల్‌ను రెచ్చగొట్టేలా ఖవాజా ఆసిఫ్‌  మాట్లాడారు. మానవత్వానికి పెద్ద నేరస్తుడిగా నెతన్యాహూను అభివర్ణించాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎక్కడా జరగని దురాగతాలు గాజాలో పాలస్తీనియన్లపై జరిగాయన్నారు. గాజాలో పాలస్తీనియన్లపై జరిగిన దారుణాలకు చరిత్రలో ఏ దురాగతాలు సరిపోలడం లేదని పేర్కొన్నారు. గత 4-5 వేల సంవత్సరాల్లో పాలస్తీనియన్లకు నెతన్యాహు చేసినంత నష్టం ఎవరూ చేయలేదని.. మానవత్వంలో అతిపెద్ద నేరస్తుడని అన్నారు. ప్రపంచంలో ఇంతకుమించిన పెద్ద నేరస్తుడిని ఎక్కడా చూడలేదన్నారు.

అయితే మరోవైపు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్‌లో భాగంగా పాక్ సైనికులు గాజాకు వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత్‌లోని ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడారు. పాకిస్తాన్ సైన్యం గాజాలో ఉండటంపై ఇజ్రాయెల్ సంతోషంగా లేదని అన్నారు. హమాస్, లష్కరేతోయిబా మధ్య సంబంధాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)