నో సీజ్‌ ఫైర్‌ ట్రంప్‌.. అంతా తుస్‌!!

Published on Tue, 06/24/2025 - 10:06

ఇరాన్‌- ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ముందే క్రెడిట్‌ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌కు పెద్ద షాకే తగిలింది. ట్రంప్‌ ప్రకటించిన కాసేపటికే అంతా ఉత్తదేనంటూ ఇరాన్‌ ప్రకటించింది. ఈ క్రమంలో ఒప్పందం కోసం ట్రంప్‌ తమను వేడుకున్నారంటూ సంచలన ప్రకటన చేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌పై మరోసారి క్షిపణులతో దాడులకు తెగబడింది. 

పశ్చిమాసియాలో యుద్ధం 12వ రోజుకి చేరగా.. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ తాజాగా మిస్సైల్స్‌ ప్రయోగించింది. ఏకంగా 10 మిస్సైల్స్‌ ప్రయోగించిందని.. ఐదుగురు మరణించారని తెలుస్తోంది. అయితే ఇరాన్‌ తమపై ఆరు క్షిపణులతో దాడులకు దిగినట్లు ధృవీకరించిన ఇజ్రాయెల్‌.. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు ప్రకటించుకుంది. మరోవైపు.. ఇజ్రాయెల్‌లో పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. ట్రంప్‌ ప్రకటన ఆయన సొంత అడ్మినిస్ట్రేషన్‌లోని ఉన్నతాధికారులను ఆశ్చర్యపరిచినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది. అదే సమయంలో ట్రంప్‌ ప్రకటనపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీ మండిపడిన సంగతి తెలిసిందే. కాసేపటికే శాంతి ఒప్పందం కోసం ట్రంప్‌ వేడుకొన్నారంటూ మరో సంచలన ప్రకటన చేసింది. 

‘‘ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్‌ మా దేశాన్ని వేడుకున్నారు. ఖతార్‌లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్ల బేరానికి వచ్చారు’’ అంటూ ఇరాన్‌ ప్రభుత్వ టీవీ ఛానల్‌ కథన ప్రసారం చేసింది. అంతకు ముందు.. కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదన్న ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి, ఇజ్రాయెల్‌ దాడులను ఆపితే.. తాము ఆపుతామని స్పష్టం చేసింది.

ఇరాన్‌ ప్రకటనతో సంబంధం లేకుండా ట్రంప్‌ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇరుదేశాలు ఒకేసారి కాళ్లబేరానికి వచ్చాయంటూ ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం సాధించామని, అందుకు గర్వకారణంగా ఉందంటూ తన సోషల్‌ ట్రూత్‌ అకౌంట్‌లో వరుస పోస్టులు పెడుతున్నారు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)