Breaking News

లూటీ.. విధ్వంసం.. కర్ఫ్యూ

Published on Thu, 06/12/2025 - 05:07

లాస్‌ ఏంజెలెస్‌: అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ నగరంలో సరైన పత్రాలులేని వలసదారుల అరెస్ట్‌లతో మొదలైన ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. మంగళవారం రాత్రి ఆందోళనకారులు వేల సంఖ్యలో పాల్గొని తమ ఉద్యమాన్ని మరింత ఉధృతంచేశారు. అయితే దీనిని అదునుగా చూసుకుని కొందరు దుండగులు ముసుగులు ధరించి లాస్‌ఏంజెలెస్‌ డౌన్‌టౌన్‌లో లూటీలకు తెరలేపారు. యాపిల్‌ ఐఫోన్‌ స్టోర్‌సహా పలు దుకాణాలపై దాడులు చేసి లూటీలు చేశారు. విలువైన వస్తువులను అందినకాడిని దోచుకెళ్లారు.

 ఉద్యమంవేళ యథేచ్ఛగా లూటీలు, విధ్వంసం జరగడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుకాణ సముదాయాల నుంచి పారిపోతున్న ముసుగు ధరించిన దుండగులను అరెస్ట్‌చేశారు. పలువురు ఆందోళనకారులను సైతం అరెస్ట్‌ చేసినట్లు వార్తలొచ్చాయి. దుకాణాలను యువకులు లూటీలు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గత నాలుగు రోజుల్లో మొత్తంగా 23 పెద్ద వ్యాపార సముదాయాలు లూటీకి గురయ్యాయని లాస్‌ ఏంజెలెస్‌ నగర మహిళా మేయర్‌ కరెన్‌ బాస్‌ చెప్పారు. 

నగరంలో తాత్కాలిక కర్ఫ్యూ
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటలదాకా పాక్షిక కర్ఫ్యూను విధిస్తున్నట్లు మేయర్‌ కరెన్‌ ప్రకటించారు. ప్రతిరోజూ ఇదే సమయానికి కర్ఫ్యూను అమలుచేయనున్నారు. ఇలా కొద్దిరోజులపాటు పాక్షిక కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. లూటీలు, విధ్వంసానికి పాల్పడిన వారికి గుర్తిస్తూ పోలీసులు అరెస్ట్‌లపర్వాన్ని మొదలెట్టారు. అడ్డొచ్చిన వారిపైకి రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించారు. డౌన్‌టౌన్‌ జిల్లాలోని ఆర్ట్స్‌ డిస్ట్రిక్, చైనా టౌన్, స్కిడ్‌ రో, ఫ్యాషన్‌ డిస్ట్రిక్‌ ప్రాంతాల్లో కర్ఫ్యూను అమలుచేశారు. 

కర్ఫ్యూ మొదలయ్యాక కనీసం 200 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారని మేయర్‌ ప్రకటించారు. లాస్‌ఏంజెలెస్‌ 2,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించగా అత్యధిక లూటీలు, విధ్వంసం జరిగిన 2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే రాత్రి కర్ఫ్యూను అమలుచేస్తామని నగర పోలీస్‌ చీఫ్‌ జిమ్‌ మెక్‌డోనెల్‌ చెప్పారు. నగరంలో మరింత ఉద్రిక్తంగా మారడానికి ట్రంప్‌ ‘నేషనల్‌ గార్డ్‌’ తరలింపు’ నిర్ణయమే కారణమని కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ ఆరోపించారు. 

సైనికఛత్రంలోకి నగరాన్ని ఇరికించి సమస్యను జటిలంచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై ట్రంప్‌ స్పందించారు. ‘‘ఆందోళనకారులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. దేశానికి శత్రువుల్లా తయారయ్యారు. అల్లరిమూకల అరాచకత్వం ఇక ఎంతమాత్రం సాగనివ్వను. అవసరమైతే తిరుగుబాటు అణచివేత చట్టం,1807ను తీసుకొచ్చి యావత్‌ సైన్యాన్ని రాష్ట్రంలోకి దింపుతా. లాస్‌ ఏంజెలెస్‌లో ఇలాగే అల్లర్లు, ఆందోళనలు కొనసాగితే సిటీని రాష్ట్ర పాలన పరిధి నుంచి తప్పించి కేంద్రప్రభుత్వ అధీనంలోకి తీసుకొస్తా’’ అని శ్వేతసౌధంలో ట్రంప్‌ హెచ్చరించారు.

కోర్టులో గవర్నర్‌కు చుక్కెదురు
న్యూయార్క్‌ గవర్నర్‌ అనుమతిలేకుండా అసా ధారణ అధికారాలతో లాస్‌ ఏంజెలెస్‌లోకి నేషనల్‌ గార్డ్, మెరైన్‌లను పంపుతూ ట్రంప్‌ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం నిలుపుదలచేయాలన్న న్యూయార్క్‌ అటార్నీ అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. ఈ అంశాన్ని గురువారం మరోసారి పరిశీలిస్తామని శాన్‌ ఫ్రాన్సిస్కో జిల్లా కోర్టు జడ్జి చార్లెస్‌ బ్రేయర్‌ చెప్పారు. మరోవైపు భద్రతా బలగాల మోహరింపు మున్ముందు మరింత ఎక్కువగా ఉంటుందని రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ చెప్పారు. 

ఇప్పటికే నేషనల్‌గార్డ్, మెరైన్‌లను రప్పించినందుకు ఏకంగా రూ.1,146 కోట్లు ఖర్చయిందని ఆయన వెల్లడించారు. అక్రమవలసదారుల కోసం గాలింపు, అరెస్ట్‌ విధుల్లో ఉన్న ఫెడరల్‌ ఏజెంట్లు, ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ అధికారుల రక్షణ, కేంద్రప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను మాత్రమే నేషనల్‌ గార్డ్‌లకు అప్పగించడంతో వాళ్లు ఆందోళనకారులను అరెస్ట్‌చేయట్లేదు. అరెస్ట్‌చేసే అధికారం వీళ్లకు లేదు. దీంతో నిరసనకారులు రెచ్చిపోతున్నారు. ఈ సందర్భంగానే ముసుగు ధరించిన ఆగంతకులు లూటీలు చేయగలిగారు.

ఇతర నగరాల్లో ఆందోళనలు
కర్ఫ్యూతో లాస్‌ ఏంజెలెస్‌లో ఉద్రిక్తత రాత్రివేళ కాస్తంత తగ్గుముఖం పట్టినా ఇతర నగరాల్లో మాత్రం ఉధృతంగా కొనసాగుతోంది. శాన్‌ ఫ్రాన్సిస్కో మొదలు సియాటెల్, న్యూయార్క్, షికాగో, డెన్వర్, శాంటా అనా, ఆస్టిన్, డాలస్, బోస్టన్, వాషింగ్టన్‌ డీసీదాకా చాలా ప్రధాన నగరాల్లో వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి చేరి ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు కొనసా గిస్తున్నారు. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు తక్కువ ప్రాణహాని ఉండే ఉపకరణాలనే వాడుతున్నారు. భాష్పవాయు గోళాలు, పెప్పర్‌ స్ప్రే, టేజర్, లాఠీలు, జల ఫిరంగులు, చెవులు చిల్లులు పడే శబ్దాలు వెదజల్లే పరికరాలు, రబ్బర్‌బుల్లెట్లు బీన్‌–బ్యాంగ్‌ రౌండ్లను ప్రయోగిస్తున్నారు.

టిక్‌టాక్‌ స్టార్‌పై బహిష్కరణ వేటు
16.24 కోట్ల మంది టిక్‌టాక్‌ ఫాలోవర్లు ఉన్న ప్రఖ్యాత ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఖబీ లేబ్‌ను సైతం అమెరికాలో ఇమిగ్రేషన్‌ అధికారులు దేశం నుంచి వెళ్లగొట్టారు. వీసా గడువు ముగిశాక సైతం అమెరికా ఉంటున్నందుకు ఆయనపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఆయనే స్వయంగా అమెరికాను వీడారని వార్తలొ చ్చాయి. సెనెగల్‌– ఇటాలియన్‌ మూలాలున్న ఇతను చేసే టిక్‌టాక్‌ వీడియో లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇతను యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసి డర్‌గా ఉన్నారు. మరోవైపు టెక్సాస్‌ రాష్ట్రంలోనూ నేషనల్‌ గార్డ్‌లను రప్పించామని ఆ రాష్ట్ర గవర్నర్‌ గ్రెగ్‌ అబ్బాట్‌ చెప్పారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)