Breaking News

ఏం జరగబోతోంది?.. ట్రంప్‌ గరం గరం.. సిట్యుయేషన్‌ రూమ్‌ రెడీ

Published on Tue, 06/17/2025 - 12:16

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో ఏదో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందనే భయాలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి.  జీ 7 సదస్సు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అర్ధాంతరంగా నిష్క్రమించడం.. పైగా ఆయన నేతృత్వంలోని సిట్యుయేషన్‌ రూమ్‌ హడావిడిగా సమావేశం అవుతుండడమే అందుకు కారణం. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌ ప్రకటించగా.. ఆ ప్రకటనను తోసిపుచ్చుతూ ‘అంతకు మించే జరగబోతోంది’ అని ట్రంప్‌ ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. 

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయి చేరుకున్న నేపథ్యంలో.. జీ7 సదస్సు నుంచి ముందుగానే ట్రంప్‌ నిష్క్రమించారు. పర్యటనను కుదించుకున్న ఆయన.. తాను జీ7 సదస్సు నుంచి వచ్చేలోపు సిట్యువేషన్‌ రూమ్‌లో సిద్ధంగా ఉండాలని జాతీయ భద్రతా మండలి(NSC)ని ట్రంప్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరికొన్నిగంటల్లో ట్రంప్ చేరుకుంటారని, ఈ సమావేశం తర్వాత ఆయన కీలక ప్రకటన చేస్తారని వైట్‌హౌజ్‌ వర్గాలు వెల్లడించాయి.‌

ట్రంప్‌ ఆఫర్‌ ఉత్తదే.. పరిస్థితి చేజారిందా?
అంతకు ముందు.. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ కాల్పుల విరమణకు ట్రంప్‌ ఆఫర్‌ చేశారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌ అధికారికంగా  ఓ ప్రకటన చేశారు. తొలుత కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుని.. ఆ తర్వాత సరిహద్దు చర్చలు ప్రారంభించాలని ట్రంప్‌ ప్రతిపాదించారని, అయితే  ఈ ఆఫర్‌ను ఇరు దేశాలు అనుసరిస్తాయా? లేదా? అనేది చూడాలని మేక్రాన్‌ అన్నారు. అయితే.. 

మేక్రాన్‌ ప్రకటనను ట్రంప్‌ తోసిపుచ్చారు. పబ్లిసిటీ కోసమే మేక్రాన్‌ అలాంటి ప్రకటన చేసి ఉంటారని, అసలేం జరగబోతోందో ఆయన ఊహించలేరని, తాను వాషింగ్టన్‌ వెళ్లేది కాల్పుల విరమణ కోసం కాదని.. అంతకు మించిందే జరగబోతోందని ట్రంప్‌ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధ పరిణామాలపై ట్రంప్‌ గరం గరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 

అదే సమయంలో..  ఈ వారంలో న్యూక్లియర్‌ డీల్‌పై ఇరాన్‌ ప్రతినిధులతో ఆరో దఫా ట్రంప్‌ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ఆ వార్తలను తోసిపుచ్చారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో అలాంటి చర్చల ప్రస్తావన కనుమరుగైందని స్పష్టత ఇచ్చారాయన. 

ఇక.. టెహ్రాన్‌ను వీడాలని ట్రంప్‌ చేసిన తాజా హెచ్చరికలు పరిస్థితి  చేజారిందనే సంకేతాలు అందిస్తున్నాయి. ట్రంప్‌ ఆ ప్రకటన చేసిన కాసేపటికే టెహ్రాన్‌లో బాంబుల వర్షం కురుస్తోందని సమాచారం. అమెరికా రంగంలోకి దిగి భారీ బంకర్‌ బస్టర్‌ బాంబులను ఇరాన్‌ అణుస్థావరాలపై ప్రయోగించవచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.

ట్రంప్‌పై ఒత్తిడి..ఇరాన్‌ మాస్టర్‌ ప్లాన్‌
గల్ఫ్‌ దేశాలతో ట్రంప్‌ను దారిలోకి తెచ్చేందుకు ఇరాన్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఖతర్‌, సౌదీ అరేబియా, ఒమన్‌ దేశాలను ఆశ్రయించింది. ఇజ్రాయెల్‌ తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్‌ దేశాలను ఇరాన్‌  కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని ఆ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)