Breaking News

పశ్చిమాసియాలో యుద్ధం.. హైపర్‌సోనిక్ క్షిపణిని ఇరాన్ ప్రయోగిస్తుందా?

Published on Wed, 03/04/2026 - 00:30

అమెరికా-ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్, అమెరికా సైతం ఇరాన్‌పై దాడులు ముమ్మరం చేశాయి. అయితే తాజాగా అమెరికా, ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన ఫతా-2 హైపర్‌సోనిక్ క్షిపణిని మోహరించింది. ఫతా-2 క్షిపణిని మోహరించినట్లు  సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. ఫతా బాలిస్టిక్ క్షిపణి  అప్‌గ్రేడ్ వెర్షన్ అని ఫతా-2 క్షిపణిగా తెలుస్తోంది. ఈ క్షిపణిని ప్రయోగిస్తున్నట్లు ఇరాన్ ఇంకా ధృవీకరించకపోయినా.. దేశ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ హత్య ఈ ఫతా-2 వంటి క్షిపణులను ఉపయోగించి ఉండవచ్చని ఓ మ్యాగజైన్‌ కథనం ప్రచురించింది.

ఫతా-2 హైపర్‌సోనిక్ క్షిపణి ప్రభావం..

ఈ హైపర్‌సోనిక్ క్షిపణి ఫతా-2ను నవంబర్ 2023లో ఎలైట్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రవేశపెట్టింది. ఇది సంప్రదాయ బాలిస్టిక్ క్షిపణి రీఎంట్రీ వాహనానికి బదులుగా.. హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనాన్ని ఉపయోగించేందుకు రూపొందించారు. ఇది ఊహించని దిశల నుండి లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడనుందని సమాచారం.ఈ ఫతా-2 క్షిపణి 1,400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. మాక్ 15 వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి సంప్రదాయ క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలదని తెలిపారు. ఈ హైపర్‌సోనిక్ క్షిపణి శక్తివంతమైన 200 కిలోగ్రాముల వార్‌హెడ్‌ను మోయగలదని వెల్లడించారు.

కాగా.. టెహ్రాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులను ప్రారంభించింది. యుఎఇ, బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. ఈ దాడులు స్థావరాలు, నౌకాదళ ప్రధాన కార్యాలయాలు సహా అమెరికా రాయబార కార్యాలయాలు, సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని దాడుల చేస్తోంది. దీనివల్ల గల్ఫ్ వైమానిక రక్షణ వ్యవస్థలకు తీవ్ర అటంకం కలుగుతోంది. ఈ దాడులతో ప్రభావిత ప్రాంతాలలో ప్రాణనష్ట, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి.
 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)