అధ్వాన్నంగా అమెరికాలో ఆరోగ్యం : ఎండోస్కోపీ కోసం 6 వారాలు

Published on Thu, 01/22/2026 - 18:31

టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్  ఆధీనంలోని  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లోని ఒక ప్రధాన  ఉద్యోగి ట్వీట్‌ వైరల్‌గా మారింది. అమెరికాలో  H1b ఫీజు పెంపుతో, అమెరిలో వైద్యం అందని ద్రాక్ష మారుతోందని అక్కడి నిపుణులు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు.  నిపుణులైన విదేశీ డాక్టర్లు అందుబాటులో లేని కారణంగా  మెడికల్‌ డెసర్ట్‌లు ఇంకా పెరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌  ఆధీనంలోని ఎక్స్‌ (ట్విటర్‌) ప్రొడక్షన్‌ హెడ్‌  చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

ఎక్స్‌ ప్రొడక్షన్‌ హెడ్‌ నికితా బియర్ తన ఆరోగ్యం గురించి తన ట్వీట్‌ ద్వారా ఒక అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ, ఫ్రైడ్‌ చికెన్ తింటు న్నప్పుడు తనకు గొంతులో గాయమైందని, దీంతో తాను సరిగ్గా మాట్లాడలేక పోతున్నానని లేదా మింగలేకపోతున్నానని చెప్పారు. వైద్యులు ఎండోస్కోపీ చేయించు కోవాలని సలహా ఇచ్చారట. ఇక్కడే అసలు విషయం గురించి చెప్పారు. ముందు నష్టాన్ని అంచనా వేయడానికి చాలా వారాలు వేచి ఉండాలని తనకు సలహా ఇచ్చారని బియర్ పేర్కొన్నారు.

ఎండో​స్కోపీ పరీక్షకోసం అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించగా , నాలుగు లేదా ఆరు వారాల తరువాతే మాత్రమే అని  చెప్పడంతో షాక్‌ అవడం అతని వంతైంది. బియర్ ఈ అనుభవాన్ని “కాఫ్కా నవల” ను వర్ణిస్తూ రాసుకొచ్చారు.  దీంతో ఈ పోస్ట్‌  వైరల్‌గా మారింది.అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ ఇంత  దారుణంగా ఉందా అనేచర్చకు దారి తీసింది.

అమెరికన్ హెల్త్‌కేర్ వ్యవస్థకు సంబంధించి  అనేకమంది విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నిలిచిపోయిన ఉద్యోగ నియామకాలు, నిపుణుల కొరత, బీమా సంబంధిత ఆంక్షలు, అధిక ఖర్చులపై మాట్లాడారు.  వీటి  కారణంగానే సాధారణ రోగనిర్ధారణ విధానాలకు కూడా  చాలా జాప్యం జరుగుతోందని  మండిపడ్డారు.

హాయిగా ఇండియా ట్రిప్‌ వేయండి! 
మరోవైపు బియర్‌ను భారతదేశంలో చికిత్స పొందాలని , అక్కడ ఆసుపత్రులలో రోగనిర్ధారణ పరీక్షలు చాలా తొందరగా అయిపోతాయని చెప్పారు. ఇండియాకు అలా విమానంలో వెళ్ళండి. గంటలోపే టాప్‌ డాక్టర్‌ని కన్‌సల్ట్‌ చేసి, ఆరు గంటల్లో ఎండోస్కోపీ లాంటివి పూర్తి చేసుకుని మూడు రోజుల్లో తిరిగి వెళ్లిపోవచ్చు అంటూ మరొకరు సూచించారు.  సత్వర చికిత్స కోసం బియర్‌ను దక్షిణ కొరియా, దుబాయ్ లేదా థాయ్‌లాండ్‌కు వెళ్లమని కొంతమంది నెటిజన్లు సలహా ఇచ్చారు.

(అనంత్‌ అంబానీ మరో లగ్జరీ వాచ్‌, అదిరిపోయే డిజైన్‌, ధర ఎంత?)

వ్యవస్థాపకుడు అమన్ గైరోలా కూడా భారతదేశ వైద్య మౌలిక సదుపాయాలను ప్రశంసిస్తూ వ్యాఖ్యానించారు. "ఇక్కడ అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా మహా అయితే 48 గంటలు పడుతుంది. దేశం అందించే సౌకర్యాలను ప్రజలు ఎప్పుడూ గ్రహించరు.  ఇక్కడ కూడా ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి కానీ క్రమంగా మెరుగుపడుతోంది" అని ఆయన రాశారు.

ఇదీ చదవండి: H-1B వీసా ఫీజు : లక్షలాది అమెరికన్ల ఆరోగ్యం సంక్షోభంలో!

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)