Breaking News

పగలంతా తేనె పలుకులు, రాత్రైతే..

Published on Mon, 07/14/2025 - 10:33

ఉక్రెయిన్‌ సంక్షోభంలో.. పుతిన్‌ వైఖరి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుతిన్‌ విధానాలు తనకేమాత్రం నచ్చడం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. ఈ ఇద్దరు దేశాధినేతలు తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటుండడం తెలిసిందే.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వైఖరి పట్ల నేను తీవ్ర నిరాశ చెందారు. పుతిన్‌ శాంతి కోసం మాట్లాడతారని అనుకున్నాను. కానీ రాత్రికి రాత్రి ఉక్రెయిన్‌పై దాడులు చేయిస్తున్నారు. ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు అని ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి పుల్‌స్టాప్‌ పెట్టే దిశగా ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడితే.. పుతిన్‌-జెలెన్‌స్కీ వైఖరి వల్ల నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. దీంతో ట్రంప్‌ తీవ్ర అసహనంతో ఉన్నారు. పైగా ట్రంప్‌-పుతిన్‌లు తరచూ ఈ అంశంపై ఫోన్‌లో మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. 

రష్యాపై ఆంక్షలు?
రష్యాపై కొత్త ఆంక్షలు విధించే అవకాశాన్ని ట్రంప్‌ సూచన ప్రాయంగా తెలియజేశారు. మేము రేపు ఏం చేస్తామో చూడండి అంటూ మీడియాతో వ్యాఖ్యానించారాయన. అమెరికా సెనేటర్లు ఇప్పటికే రష్యాపై ‘స్లెడ్జ్‌హామర్‌’(కఠినమైన) ఆంక్షల బిల్లును ప్రతిపాదించిన సమాచారం. పైగా ఈ బిల్లు రష్యా విషయంలో ఆంక్షలు విధించేందుకు ట్రంప్‌కు విస్తృత అధికారాలను కల్పించనుందని తెలుస్తోంది.

తాజా వ్యవహారంతో ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరీముఖ్యంగా అమెరికా-రష్యా సంబంధాల్లో కీలక మలుపుగా భావించబడుతున్నాయి. ట్రంప్‌ మాటలు, చర్యలు.. ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల్లో రష్యాపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పేట్రియాట్‌ ఎయిర్ డిఫెన్స్‌ క్షిపణులను అందించనున్నట్లు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌కు ఇది ఎంతో అవసరమని అని ఆయన.. ఈ ఆయుధాల ఖర్చును అమెరికా భరించదని, యూరోపియన్ యూనియన్‌ 100% చెల్లించనుందని తెలిపారు.ఈ క్రమంలో ఇది జస్ట్‌ బిజినెస్‌ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)