ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...
Breaking News
రొనాల్డో రిటైర్‌మెంట్‌పై తొలి స్పందన.. భార్య భావోద్వేగం
Published on Thu, 11/05/2026 - 19:54
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి రేపింది. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చేసిన ప్రకటనతో లక్షలాది అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. 41 ఏళ్ల వయసులో ఈ దిగ్గజ ప్లేయర్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆయన భార్య జార్జినా రోడ్రిగ్స్ (Georgina Rodriguez) స్పందన విశేషంగా నిలుస్తోంది.
"పోర్చుగల్ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది" అనే క్యాప్షన్‌తో రొనాల్డో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగ వీడియోను పంచుకుంటూ తన రిటైర్‌మెంట్ గురించి వెల్లడించారు. పోర్చుగల్ జట్టును అంతర్జాతీయ ఫుట్‌బాల్ వేదికపై ఒక శక్తివంతమైన జట్టుగా నిలబెట్టడంలో రొనాల్డో పాత్ర అపారమైనది. 23 ఏళ్ల పాటు దేశానికి సేవ చేసిన ఆయన, రొనాల్డో, ఐదుసార్లు 'బాలన్ డి ఓర్' (Ballon d'Or) అవార్డును గెలుచుకున్నారు. తాజాగా 23 ఏళ్లపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టేడియాల్లో దీన్ని ధరించి, దేశం కోసం ప్రాతినిధ్యం వహించే అవకాశం, బాధ్యత దక్కిన తనకు . ఈరోజు, ఆ బాధ్యతను భవిష్యత్ తరాలకు అందించే సమయం ఆసన్నమైందనీ, తన ఐకానిక్ '7వ నంబర్ జెర్సీ'ని తర్వాతి తరానికి అప్పగించే సమయం వచ్చిందంటూ రొనాల్డో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: డాగ్ ఎటాక్ : రక్తసిక్తమైన నటి ముఖం, మాయని మచ్చ..అందుకే!
రొనాల్డో రిటైర్‌మెంట్ ప్రకటనపై అందరికంటే ముందుగా జార్జినా రోడ్రిగ్జ్ స్పందించారు. ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆ వీడియోను లైక్ చేసిన జార్జినా... కన్నీళ్లు, లవ్ ఎమోజీలతో తన ప్రేమానురాగాలను చాటుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. చరిత్ర సృష్టించిన తర్వాత క్రీడాకారుడు ఎవరైనా సరే, రిటైర్మెంట్ తీసుకోవడం అంత సులభమైన విషయం కాదు.

గత రెండు దశాబ్దాలుగా, రొనాల్డో ఆడిన ప్రతి మ్యాచ్‌తో చరిత్ర సృష్టిస్తూ వచ్చారు. ఆయన తన దేశం తరపున ఆరు ప్రపంచ కప్‌లలో పాల్గొన్నారు. అయితే, అతని చివరి సీజన్ రౌండ్ ఆఫ్ 16లో స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమితో ముగిసింది. 41 ఏళ్ల వయస్సులో రొనాల్డో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం యావత్ క్రీడా ప్రపంచంలో భావోద్వేగాన్ని నింపింది. ఐదు సార్లు బాలన్ డి ఓర్ గ్రహీత , రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పినా, ఆటకు ఆయన అందించిన సేవలు, రికార్డులు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.
ఇదీ చదవండి: పండగవేళ పతంజలికి భారీ షాక్ : తుకారం ముండే దెబ్బ
రొనాల్డో జార్జినా లవ్: 2016లో మ్యాడ్రిడ్‌లోని గుస్సీ (Gucci) స్టోర్‌లో పరస్పరం పరిచయమైన ఈ జంట 2026 ఆగస్టులో తమ 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2017లో మొదటి సంతానం అలనా జన్మించింది. ఆ తర్వాత 2022లో బెల్లా ఎస్మెరాల్డా జన్మించగా, ఆమె కవల సోదరుడు ప్రసవ సమయంలో మరణించాడు. క్రిస్టియానో రొనాల్డో జూనియర్‌కు, అలాగే సరోగసీ (అద్దె గర్భం) ద్వారా జన్మించిన కవలలు ఈవా మరియా, మాటియోలకు చట్టపరమైన సంరక్షకులుగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి: కొత్త ఉద్యోగం : రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే డబ్బు!
Tags : 1