Breaking News

‘డబ్బులు చెల్లిస్తా.. నన్ను వదిలేయండి సార్‌’..అమెరికాలో భారత యువతి

Published on Sun, 11/02/2025 - 17:24

వాషింగ్టన్‌: అమెరికాలో మరో భారత యువతి దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికింది. పైగా తాను దొంగతనం చేయలేదని బుకాయించింది. తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లించడం మరిచిపోయానంటూ ప్రాధేయపడింది. కావాలంటే ఇప్పుడు తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లిస్తా. నన్ను వదిలేయండి’ అంటూ చేతులు జోడించి అక్కడి పోలీసుల్ని వేడుకుంది. ఈ ఘటన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.    

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ఓ యువతి టూరిస్ట్‌ వీసాతో అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సమయంలో అమెరికాకు చెందిన ఓ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ ఓ షాప్‌లో తనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం, అక్కడి నుంచి  వెళ్లే ప్రయత్నం చేయగా.. సదరు షాపు యజమాని ..తన షాపులో ఓ యువతి దొంగతనం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తు వీడియోలో.. ఆ యువతి ఎలా శిక్ష విధించకుండా వదిలేయమని కోరింది. తాను షాపులు వస్తువుల్ని కొనుగోలు చేశానే తప్పా.. దొంగతనం చేయలేదని, కొనుగోలు చేసిన వస్తువులకు ఇప్పుడే డబ్బులు చెల్లిస్తానని చెప్పడం ఆవీడియోలో చూడొచ్చు. కాగా, ఆ యువతి వివరాలు, ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది.  

👉ఇదీ చదవండి: చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా?

కొద్దిరోజుల క్రితం 
కొద్దిరోజుల క్రితం మనదేశానికే చెందిన ఓ మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్‌లో డిపార్టుమెంటల్ స్టోర్సుకు వెళ్లి.. ఏకంగా 1300 డాలర్ల విలువైన వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించిందట. బిల్లు ఎగ్గొట్టి జారుకోవాలని చూస్తే.. చివరికి పోలీసుల పాలైంది. దొరికి పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ‘సారీ సర్.. ప్లీజ్ సర్, ఫస్ట్ టైం సర్, క్షమించండి సర్..’ అని కోరినప్పటికీ పోలీసులు ఆమెను కటకటాల వెనక్కు పంపారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)