Breaking News

అన్నదమ్ముల్ని పెళ్లాడిన యవతి.. ఇదెక్కడి ఆచారం!

Published on Sun, 07/20/2025 - 11:03

ఒక వధువు.. ఇద్దరు పెండ్లి కొడుకులు.. పైగా అన్నదమ్ములు.. వివాహంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు వందలమంది హాజరై.. ఆ అరుదైన జంటను ఆశీర్వదించారు కూడా. ఈమధ్యకాలంలో జరిగే పరిణామాలతో పెళ్లంటేనే వణికిపోతున్న క్రమంలో.. ‘హవ్వా ఇదెక్కడి ఆచారం అనుకుంటున్నారా?’ అయితే ఈ కథనంలోకి పదండి..  

హిమాచల్‌ ప్రదేశ్‌ సిరమూర్‌ జిల్లా షిల్లై గ్రామంలో జులై 12 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. హట్టి తెగ జానపద పాటలతో, నృత్యాలతో అన్నదమ్ములైన ప్రదీప్‌, కపిల్‌లను సునీతా చౌహాన్‌ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వేడుకకు హాజరై వాళ్లను ఆశీర్వదించారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

ప్రదీప్‌ స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగి కాగా.. అతని సోదరుడు కపిల్‌ విదేశాల్లో జాబ్‌ చేస్తున్నాడు. కున్‌హట్‌ గ్రామానికి చెందిన సునీత పెద్దల మాటకు విలువ ఇచ్చే ఈ వివాహం చేసుకుందట. తమపై ఎవరి ఒత్తిడి లేదని, ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని, పైగా ఇలా వివాహం చేసుకోవడం(polyandry) అనాదిగా తమ తెగలో వస్తున్న ఆచారమని చెబుతున్నారు. పైగా ఈ వివాహం తమకెంతో గర్వంగా ఉందని ఫొటో షూట్‌లో ఉత్సాహంగా పాల్గొంటూ చెప్పారు.  

హట్టి తెగ ప్రజలు హిమాచల్‌ ప్రదేశ్‌-ఉత్తరాఖండ్‌ సరిహద్దులో ట్రాన్స్‌ గిరి రీజియన్‌లో 450 గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. మూడేళ్ల కిందటే ఈ తెగకు షెడ్యూల్డ్‌ ట్రైబ్‌(గిరిజన తెగ.. ఎస్టీ) గుర్తింపు దక్కింది. అయితే వేల ఏళ్లుగా బహుభర్తృత్వం((polyandry)ను ఈ తెగ పాటిస్తోందట. అందుకు భూవివాదాలే ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

కుటుంబ ఐక్యత.. తద్వారా భూవివాదాలు లేకుండా ఉండేందుకే హట్టి తెగ ఈ ఆచారం మొదలుపెట్టిందట. సోదరుల మధ్య బంధం బలంగా ఉండి ఉమ్మడి కుటుంబంలో గొడవలు జరగవనేది మరో కారణం. అంతేకాదు.. ఇద్దరు భర్తలు ఉంటే తమ ఆడబిడ్డలకు రక్షణ బలంగా ఉంటుందని ఈ తెగవారు భావిస్తారట. 

అయితే.. మారుతున్న పరిస్థితులు, మహిళలు చదువుకోవడం, ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడడం.. కారణాలతో ఈ తరహా వివాహాలు అరుదుగా జరుగుతూ వస్తున్నాయి. ఈ తరహా వివాహాలకు అక్కడి రెవెన్యూ చట్టాలు కూడా సమ్మతిని తెలుపుతున్నాయి. జోడిధారా పేరుతో గత ఆరేళ్లలో ఈ తరహా వివాహాలు ఐదు జరిగాయని అధికారులు చెబుతున్నారు. 

హట్టి తెగలో ‘జాజ్దా’ పేరుతో ఈ వివాహ సంప్రదాయం కొనసాగుతుంది. పెళ్లి కూతురిని ఊరేగింపుగా పెళ్లి కొడుకులు ఉన్న ఊరికి తీసుకొస్తారు. అక్కడ వరుడి ఇంట సీంజ్‌ అనే పద్దతిలో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. వాళ్ల భాషలో పంతులుగారు మంత్రాలు చదువుతూ.. పవిత్ర జలాన్ని వధువు- ఇద్దరు పెళ్లి కొడుకుల మీద జల్లుతాడు. ఆపై ఆ ముగ్గురు ఒకరికొరు బెల్లం తినిపించుకుంటారు. ఆఖర్లో కుల్‌ దేవతా ఆశీర్వాదంతో ఈ వివాహ తంతు ముగుస్తుంది. హిమాలయ పర్వతాల రీజియన్‌లోని కొన్ని తెగలు ఒకప్పుడు ఈ తరహా వివాహాలకు మక్కువ చూపించేవి.  తమిళనాడులో తోడా అనే తెగ ఒకప్పుడు ఈ ఆచారం పాటించేది. అలాగే నేపాల్‌, కెన్యాలో కొన్ని తెగల్లో ఇప్పటికీ  ఈ తరహా వివాహాలు జరుగుతున్నాయి.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)