Breaking News

Travel: మంచు పర్వతాలలో మహానుభూతి..

Published on Mon, 07/13/2026 - 08:06

మంచుతో కప్పబడిన పర్వతాలు, నిశ్శబ్దంగా పరుగులు తీసే వాగులు.. దూరం నుంచి వినిపించే ‘హర హర మహాదేవ్‌’ అనే నామ స్మరణం.. ఇవన్నీ కలిసి అమర్‌నాథ్‌ యాత్రని ఒక సాధారణ ట్రిప్‌లా కాకుండా మనసుని స్పృశించే ఆధ్మాత్మిక ప్రయాణంగా మార్చేస్తాయి. అమర్‌నాథ్‌ గుహాలయానికి చేరిన తరువాత గమ్యం కన్నా ప్రయాణమే బాగా గుర్తుంటుంది. ప్రతీ అడుగు ప్రకృతికి దగ్గరగా, ప్రతీ క్షణం దేవదేవుడికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తుంది. హిమాలయాల మధ్య నడుస్తూ వెళ్తుంటే సమయం కూడా కొంచెం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది.

జమ్మూ అండ్‌  కశ్మీర్‌లో ఉన్న అమర్‌నాథ్‌ గుహాలయం ప్రతీ సంవత్సరం కొన్ని రోజులు మాత్రమే భక్తుల కోసం తెరుచుకుంటుంది. ఈ గుహలో ప్రకృతి స్వయంగా మంచుతో రూపొందించిన శివలింగాన్ని చూసి భక్తులు పరవశించిపోతారు. గుహలో అడుగుపెట్టిన వెంటనే చల్లని గాలి, మంచు వాసన, మౌనం.. ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన దివ్య వాతావరణాన్ని సృష్టిస్తాయి. గుహలో మంచు లింగం ముందు నిలబడిన క్షణంలో మనసంతా ప్రశాంతంగా అయిపోతుంది. ఇక్కడ భక్తి అనేది మాటల్లో కాదు... అనుభవంలో ఉంటుంది.


సందర్శనీయ ప్రదేశాలు

  • అమర్‌నాథ్‌ యాత్రలో పహల్గామ్‌ రూట్‌ చాలా అందంగా ఉంటుంది. పచ్చని పచ్చిక బయలు, గంభీరంగా నిలబడిన హిమ శిఖరాలు, వాగుల మధ్య సాగే ఈ మార్గం ప్రతీ మలుపులో కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది. చందన్‌ వారి దగ్గర చల్లని గాలి మనసుని రిఫ్రెష్‌ 
    చేస్తుంది.

  • శేష్‌నాగ్‌ లేక్‌ దగ్గర నీళ్లు ఆకాశాన్ని అద్దంలా ప్రతిబింబిస్తాయి. పంచతరణి చేరిన తరువాత హిమాలయాల వైభవం మరింత గొప్పగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలు చూస్తూ వెళ్తుంటే గమ్యం ఎంత మధురమో ప్రయాణం అంతే మధురంగా అనిపిస్తుంది.

  • యాత్ర పూర్తి చేసుకున్న తరువాత శ్రీనగర్‌లో డాల్‌ లేక్‌ పై హౌజ్‌బోట్‌లో గడిపిన సాయంత్రం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. మొఘల్‌ గార్డెన్స్‌లో నడవడం, లోకల్‌ బజార్‌లో కశ్మీర్‌ సంస్కృతిని చూడడం కూడా ఈ ప్రయాణానికి ఇంకో అందాన్ని జోడిస్తాయి.

  • కశ్మీర్‌ క్యూజిన్‌ లో దమ్‌ ఆలూ, రాజ్మా చావల్, కావా టీ, కశ్మీరీ రోటీ లాంటి సింపుల్‌ డిషెస్‌ చల్లని వాతావరణంలో ఇంకా రుచిగా అనిపిస్తాయి. లోకల్‌ టీ స్టాల్స్‌ దగ్గర దొరికే గరం గరం చాయ్‌ అనేది జర్నీ మధ్య ఒక చిన్న బ్రేక్‌ని మెమొరబుల్‌ చేస్తుంది.

  • ఫ్రెష్‌ డ్రై ఫ్రూట్స్, వాల్‌నట్స్, ఆల్మండ్స్, ఏప్రికాట్స్‌ టేస్ట్‌ చేస్తూ లోకల్‌ ఫ్లేవర్‌ని ఎంజాయ్‌ చేయవచ్చు. ప్రతీ భోజనం అక్కడి వాతావరణం లాగే సింపుల్‌గా, ఆథెంటిక్‌గా ఉంటుంది.


ఎలా వెళ్లాలి?

  • హైదరాబాద్‌ నుంచి శ్రీనగర్‌కు డైరెక్ట్‌ లేదా కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ దొరుకుతాయి. ఫ్లైట్‌లో హిమాలయాలపై ప్రయాణిస్తున్న సమయం నుంచే ఈ యాత్ర ఫీలింగ్‌ మొదలవుతుంది.

  • శ్రీనగర్‌ చేరుకున్న తరువాత రోడ్డు మార్గంలో పహల్గామ్‌ లేదా బాల్టాల్‌ వరకు వెళ్లవచ్చు. ఈ రోడ్‌ ట్రిప్‌లో కశ్మీర్‌ వ్యాలీ అందాలు ప్రతీ విండో ఫ్రేమ్‌ని ఒక పోస్టుకార్డ్‌లా మార్చేస్తాయి.

  • విజయవాడ నుంచి వెళ్లాలనుకునే వారు హైదరాబాద్‌ లేదా ఢిల్లీ మీదుగా శ్రీనగర్‌ చేరుకోవచ్చు. అక్కడి నుంచి ప్రయాణం అనేది ప్రకృతి మధ్య నిశ్శబ్దంగా సాగుతుంది.



ఏం చూడాలి?

  • ఉదయం మంచు శిఖరాలపై పడిన వెలుగు చూడటం ఒక అందమైన దృశ్య కావ్యంలా అనిపిస్తుంది. పర్వతాల మధ్య సాగే భక్తులు, గుర్రాల సవారి, చల్లని గాలిలో ఎగురుతున్న ప్రార్థనా ధ్వజాలుం ఇవన్నీ కలిసి ఒక సినిమా సీన్‌ లా అనిపిస్తాయి.

  • డాల్‌ లేక్‌లో శిఖారా రైడ్, లోకల్‌ మార్కెట్స్‌లో హ్యాండీక్రాఫ్ట్స్‌ కశ్మీర్‌లో కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్‌ షాపులు.. ఇవన్నీ చూస్తూ గడిపిన సమయం కూడా మెమొరబుల్‌గా ఉంటుంది.

ఆసక్తికరమైన విషయాలు

  • అమర్‌నాథ్‌ గుహాలయం హిమాలయాల మధ్య సుమారు 3,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

  • ప్రతీ సంవత్సరం కొన్ని వారాలు ΄ాటు మాత్రమే అమర్‌నాథ్‌ యాత్రను నిర్వహిస్తారు.

  • మంచుతో ఏర్పడే స్వయంభు శివలింగాన్ని దర్శించేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తారు.

  • పహల్గామ్, బాల్టాల్‌ అనే రెండు ప్రధాన యాత్రా మార్గాల ద్వారా గుహాలయానికి చేరుకోవచ్చు.

  • జూలై, ఆగస్టు నెలల్లో హిమాలయాల అందాలు మరింత ఆకట్టుకుంటాయి.


ఎక్కడ ఉండాలి?

  • శ్రీనగర్‌లో హౌజ్‌బోట్స్, లేక్‌ వ్యూ హోటల్స్, బోటిక్‌ స్టేస్‌ ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి. ఉదయం డాల్‌ లేక్‌పై పడవల శబ్దంతో మేల్కొనడం ఒక స్పెషల్‌ ఫీలింగ్‌ ఇస్తుంది.

  • పహల్గామ్‌లో కాటేజీలు, హోటల్స్, నేచర్‌ రిసార్ట్స్‌లో చల్లని గాలి, పచ్చని చెట్లు, పర్వతాల అందాలు రోజంతా మనసుని రిఫ్రెష్‌ చేస్తాయి. యాత్ర మార్గంలో ఉండే క్యాంపులు కూడా హిమాలయాల మధ్య ఒక యూనిక్‌ స్టే ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తాయి.

యాత్ర, బడ్జెట్‌ వివరాలు

  • హైదరాబాద్‌ నుంచి 5 రోజుల అమర్‌నాథ్‌ యాత్రను బడ్జెట్‌లో ప్లాన్‌ చేస్తే సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 మధ్య పూర్తి చేయవచ్చు. కొంచెం కంఫర్ట్‌గా వెళ్లాలి అనుకుంటే రూ.40,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చు అవుతుంది

  • ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్‌ కోసం మంచి హోటల్స్, ఫ్లైట్స్, ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణంతో కలిపి రూ.70,000 నుంచి రూ.1 లక్షా 10 వేల వరకు ప్లాన్‌ చేసుకోవచ్చు. విజయవాడ నుంచి ట్రావెల్‌ చేస్తే టోటల్‌ బడ్జెట్‌ కాస్త పెరగవచ్చు.

  • శ్రీనగర్‌ హోటల్స్‌లో పర్‌ నైట్‌ రూ.2,000 నుంచి రూ.8,000 వరకు ఆప్షన్స్‌ ఉంటాయి. ప్రీమియం లేక్‌ వ్యూ స్టేస్‌ కోసం రూ.10,000 వరకు కూడా ఖర్చు చేస్తారు.

  • ఫుడ్‌ కోసం ప్రతీ రోజు సగటున రూ.700 నుంచి రూ.1,500 వరకు ప్లాన్‌ చేసుకుంటే సరిపోతుంది.

గమనిక :  ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్‌ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. ప్రయాణానికి ముందు తాజా వివరాలు, వాతావరణం, స్థానిక పరిస్థితులను స్వయంగా చెక్‌ చేసుకుని ప్లాన్‌ చేసుకోగలరు.

– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)