మున్సిపల్ రిజల్ట్స్ 2026 పెద్దపల్లిలో చక్రం తిప్పిన మంత్రి శ్రీధర్
Breaking News
పాఠం నుంచి పాకం దాకా
Published on Fri, 02/13/2026 - 05:44
ఆమె ఎంబీఏ చేసింది. ముంబాయిలో ఓ పేరున్న కార్పొరేట్ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా పెద్ద జీతం మీద పాఠాలు చెబుతూ మంచి పేరే తెచ్చుకుంది. అయితే ఉన్నట్టుండి ఆమె పాఠాలు చెప్పే ఉద్యోగాన్ని మానేసి ఇంటి దగ్గరే హెల్దీ శ్నాక్స్ తయారీకి శ్రీకారం చుట్టింది. రుచిగా, శుచిగా ఉండే చిరుతిళ్లను చాలా తక్కువ ధరకే అమ్మడం మొదలు పెట్టింది. ఇప్పుడామె తయారు చేసే శ్నాక్స్ యూఎస్, కెనడా, ఆస్ట్రేలియాలతో సహా దాదాపు పదిహేను దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆమే జైపూర్‌కు చెందిన రిచాశర్మ. ఇంతకీ ఆమె ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో... ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా ఎదిగిందో చూద్దాం...
రిచాశర్మది జైపూర్. ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసింది. అక్కడే ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసింది. అయితే అది ఆమెకు చాలా దూరం కావడంతో ప్రయాణాలు చేయలేక వడోదరలోని పరుల్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరింది. అక్కడ నాలుగైదేళ్ల పాటు పని చేసింది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ముంబాయి మహానగరంలో కాలు పెట్టింది. అప్పుడే ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టడం, వారి ఆలనా పాలనా చూసుకోవడం తో ఇక ఉద్యోగం ఊసులేకుండా వారితోటే పూర్తికాలం గడిచి పోయింది. మెల్లగా ఆ పిల్లలు రెండు, ఆరు తరగతులకొచ్చారు.
వాళ్లకోసం రకరకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తయారు చేసి పెట్టేది. ఈ క్రమంలో ఆమె చేసే తినుబండారాలను పిల్లల ద్వారా వారి స్నేహితులు, వాళ్ల వాళ్ల ఇళ్లలోనిÐ éళ్లూ రుచి చూశారు. అవి వారికి బాగా నచ్చడంతో వారిలో కొందరు ‘మీ పిల్లలకోసం తయారు చేసేటప్పుడే... మరికొద్ది మొత్తంలో మా పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు కదండీ’ అని అడగడంతో రిచాశర్మ గ్లుటెన్, మైదా, డాల్డా లాంటివి లేకుండా రుచికరమైన కమ్మటి శ్నాక్స్ తయారు చేయడం మొదలు పెట్టింది. చిరుధాన్యాలైన రాగులు, జొన్నలతో లడ్డూలు, ధోక్లా, కచోరీలు, సబ్జీలు తయారు చేసేది. అవి అక్కడివాళ్లకు అమితంగా నచ్చేవి. మాకు కావాలంటే మాకు కావాలని అందరూ పోటీపడేవాళ్లు. దాంతో ఆమె ‘రిచా ప్లేటర్’ పేరుతో శ్నాక్స్ సప్లై చేసేది.
కోవిడ్ మార్చేసిన జీవితం
అలా సాగుతున్న ఆమె జీవితంలో కోవిడ్ పెను మార్పు తెచ్చింది. ఇక్కడ మార్పు అనగానే ఆమె చేసే శ్నాక్స్ బిజినెస్ కాస్తా దెబ్బ తిందేమో అని జాలిపడితే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే కోవిడ్ సమయం లో రిచాశర్మ రుచిగా శుచిగా శుభ్రంగా చేసే హోమ్ మేడ్ ఫుడ్ కోసం జ నాలు ఎగబడ్డారు. దాంతో ఆమె బిజినెస్ ఇబ్బడిముబ్బడిగా పెరిగి పోయింది. అప్పుడే ఆమె తన బిజినెస్ స్కిల్స్‌ను మరింత అభివృద్ధి చేసుకుంది. ఆర్డర్లకు తగ్గట్టే ప్రిపేర్ చేయడం వల్ల మిగిలి పోవడం కానీ, తక్కువ కావడం కానీ ఎప్పుడూ జరగలేదామెకి. దాంతో అప్పటివరకు మామూలు చిన్న చిన్న తినుబండారాల తయారీ నుంచి రకరకాల స్వీట్స్ తయారీకీ శ్రీకారం చుట్టింది రిచా. మొదట్లో నెలకు 20 ఆర్డర్లతో సరిపెట్టుకున్న రిచా శర్మ చూస్తుండగానే నెలకు 500 ఆర్డర్లకు సప్లై చేసేంతగా అభివృద్ధి చెందిందామె వ్యా పారం.
ఖర్, బోరివలి, అంధేరిలకే పరిమితమైన ఆమె కష్టమర్లు కోయంబత్తూరు, బెంగళూరు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌ల వరకు విస్తరించారు. తన బిజినెస్‌కు ‘హంబుల్ ఫ్లేవర్స్’ అనే పేరు పెట్టి దానిని ఇంకా ఇంకా పెంచింది రిచా. వచ్చిన లాభాలలో ఐదుశాతం వాటాను ఎన్జీవోలకు డొనేట్ చేస్తుంది రిచా. మరో ఐదుశాతం లాభాలను తనతో పని చేసే వారికి ఇస్తుంది రిచా. వ్యా పారం ద్వారా లాభాలను గడించడం తన లక్ష్యం కాదని, అందరికీ హెల్దీ, టేస్టీ శ్నాక్స్ అందించడంలోనే తనకు సంతృప్తి లభిస్తుందని చెప్పే రిచాను ఇండియన్ ఇన్స్పైరింగ్ హోమ్ బిజినెస్ ఉమన్ అవార్డు వరించింది.
Tags : 1