Breaking News

చిన్న వయసులోనే పెళ్లి, బాధ్యతలు: పట్టుదలతో IAS అధికారిగా

Published on Wed, 05/28/2025 - 17:45

మహిళలు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అధిగమించి ఉన్నత స్థాయి నైపుణ్యాలతో రాణిస్తున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సంవత్సరాలుగా, పౌర సేవలలో మహిళా అధికారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాంటి వారిలో ఒకరు  మిన్ను జోషి.  ఒక బిడ్డకు తల్లిగా కుటుంబ బాధ్యతల్లో మునిగి పోయిన ఆమె నేడు ఆమె కేవలం శ్రద్ధగల అధికారి మాత్రమే కాదు, ఆమె మొత్తం కుటుంబం గర్వించదగిన వ్యక్తిగా ఎదిగింది. సంకల్పం  ఉంటే ఒక స్త్రీ తన ఇంటి బాధ్యతలను పోషిస్తూనే తన కలలను ఎలా  సాకారం చేసుకోవచ్చో నిరూపించింది.

ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు  తమ దృఢ సంకల్పం, ఆకాంక్ష శ్రద్ధతో  ఉన్నత శిఖరాల అధిరోహిస్తున్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు.  ఒక్కొక్కరిదీ ఒక్కో  విజయగాథ. కుటుంబం ఇచ్చిన మద్దతుతో, ఆకాశాన్ని లక్ష్యంగా చేసుకుంది.భారతదేశంలోని అత్యంత కఠినమైన  సివిల్స్‌లో సత్తా చాటినమిన్ను జోషి సక్సెస్‌ జర్నీని పరిశీలిద్దాం. 

చదవండి: ట్విటర్‌ గాలం : ఇండో-అమెరికన్‌ , యూట్యూబ్‌ సీఈవోకి గూగుల్‌ భారీ ఆఫర్‌

కేరళలోని పతనంతిట్ట అనే చిన్న గ్రామంలో మిన్ను జోషి పుట్టింది.  మిన్ను తండ్రి పోలీసు. మిన్నుకి 21 ఏళ్ల వయస్సులోనే వివాహం అయింది.  ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. భార్యగా, కోడలిగా, తల్లిగా కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయినా తన కలను సాకారం కోసం తనను తాను సంసిద్ధం చేసుకుంది. దివంగత తండ్రి కలను  సాకారం చేయాలని గట్టిగా  నిర్ణయించుకుంది.

ఇదీ చదవండి: పాపులర్‌ యూ ట్యూబర్‌ సీక్రెట్‌ వెడ్డింగ్‌ : స్టూడెంట్స్‌కి సర్‌ప్రైజ్‌

పోలీసుగా గౌరవ స్థానంలో ఉన్న తండ్రిని చూసి  తాను కూడా మరింత ఉన్నతంగా ఎదగాలని కలకనింది. అయితే, ఎంతో ప్రేమించిన తండ్రి అకాల మరణం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది. 2012లో 'డై-ఇన్-హార్నెస్' పథకం ద్వారా ఆమె కేరళ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో క్లరికల్ పదవిని పొందింది. అయినా  ‘ఐఏఎస్‌’ డ్రీమ్‌ను విడిచిపెట్టలేదు.  బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన 26 సంవత్సరాల వయస్సులో, ఆమె ఐఎఎస్ పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించింది. ఇది కేవలం తన కలకోసం మాత్రం  కాదని, మరణించిన తండ్రి సేవకు కొనసాగింపు అని  భావించింది.  2015లో  శంకర్ ఐఏఎస్ అకాడమీలో చేరిం కష్టపడింది. రెండేళ్ల  తరువాత మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. అయితే, ఆమె ఇంటర్వ్యూలలో విఫలమైంది. అయినా పట్టువీడలేదు. నిరుత్సాహపడలేదు. చివరికి తొలి ఆరు ప్రయత్నాలు, సుదీర్ఘమైన అధ్యయన సెషన్ల తర్వాత, సివిల్ సర్వీసెస్ పరీక్షలో 150 ఆల్ ఇండియా ర్యాంక్‌ను సాధించి తానేంటో  నిరూపించుకుంది.

చదవండి: ‘ఎర్ర’ గౌనులో దీపికా రాయల్‌ లుక్‌ : స్పిరిట్‌పై ఫ్యాన్‌ కామెంట్‌ వైరల్‌

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)