Breaking News

హింసన చణ... ధ్వంస రచన!

Published on Wed, 02/04/2026 - 00:49

సుప్రసిద్ధ కథా, నవలా రచయిత రావి శాస్త్రి అయిదు దశాబ్దాల క్రితం ‘సొమ్మలు పోనాయండి’ అనే నవలిక రాశారు. ఊరి ప్రెసిడెంట్‌ కుట్రలకు బలైన ఒక సామాన్యుడి స్వీయ కథనమది. అతని కుటుంబాన్ని కడతేర్చిన ప్రెసిడెంట్‌ను వదిలి, వ్యవస్థలన్నీ ఏకమై ఆ సామాన్యుడికే నరకం చూపిన వైనం అందులో కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలన ఏణ్ణర్థంగా అచ్చం అదే రీతిలో సాగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేసిన దుష్ప్రచారం బూటకమని సీబీఐ నివేదిక తేల్చినప్పటి నుంచీ ఆ అరాచకం మరిన్ని రెట్లు పెరిగింది. ఎప్పటిలాగే లడ్డూ ప్రసాదం స్వచ్ఛంగా ఉన్నదనీ, కొవ్వెక్కిన ఈ మాయగాళ్ల పుర్రెలే వికృత పోకడలకు పోయాయనీ ప్రజలకు తేటతెల్లమైనప్పటి నుంచీ అధికార ముఠాకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు.

ఆ పర్యవసానంగానే రోడ్లపైకొచ్చి దుర్భాషలతో, దుశ్చేష్టలతో రెచ్చిపోతున్నారు. హంతక దాడులకు తెగిస్తున్నారు. గృహ దహనాలకు పాల్పడుతున్నారు. ‘మళ్లీ మళ్లీ వస్తాం... అంతు తేలుస్తామ’ంటూ సవాళ్లు విసురుతున్నారు. సీబీఐ నివేదికను వక్రీ కరిస్తూ ఫ్లెక్సీలతో జనాన్ని ఏమార్చాలనుకుంటున్నారు. గుంటూరు నడిబొడ్డున తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త వందలాది మంది గూండాలను పోగేసి కర్రలు, రాడ్లతో వీధిన పడి మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అంబటిరాంబాబు ఇంటిపై దాడికి దిగిన వైనం మీడియా సాక్షిగా ప్రపంచమంతా చూసింది.

రక్షక భటులు భయభక్తులతో వారికి కాపలాగాసిన సంగతినీ అందరూ గమనించారు. ఆ మర్నాడు ఇబ్రహీంపట్నంలో అదే పునరావృతమైంది. తొలినాడు ఎంత విధ్వంసం చేసినా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యాలయం తగలబెట్టడానికి కష్టపడాల్సి వచ్చిందని కాబోలు... ఇబ్రహీంపట్నంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపైకి పెట్రోల్‌ బాంబులతో వచ్చారు. బండరాళ్లు విసిరారు. నిప్పుపెట్టారు. గుంటూరు నగర పోలీసుల మాదిరే ఇక్కడా ఈ కిష్కింధకాండకు పోలీసులు రక్షణగా నిలబడ్డారు.

ఇదా ప్రజాస్వామ్యం?! పిల్లనిచ్చిన మామ పాలిటే కాదు... ఆంధ్రప్రదేశ్‌కు కూడా దశమ గ్రహంలా దాపురించి, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు వయసుడిగిన ఈ కాలంలో కూడా బాహాటంగా తన వికృత నైజాన్ని ప్రదర్శించటం చూసి జనం విస్తుపోతున్నారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్, కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా తదితరుల మరణాలకు కారకులెవరో... ఇప్పుడు టీడీపీలోనే ఉన్న సీనియర్‌ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణపై ఒకానొకప్పుడు హంతక దాడికి తెగించిందెవరో... అందరికీ తేటతెల్లమే. సాక్షాత్తూ మాజీమంత్రి డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావే తోడల్లుడి హింసన చణనూ, ధ్వంస రచననూ పూసగుచ్చినట్టు వివరించారు. కొన్నేళ్ల క్రితం తగలబడిన వందలాది ఆర్టీసీ బస్సులు, పదేళ్లనాడు అమరావతిలో దగ్ధమైన అరటి తోటలు ఆ ప్రావీణ్యాన్ని కథలు కథలుగా చెబుతాయి.



అవిభక్త ఏపీలో 1995 తర్వాత సకల వ్యవస్థలూ భ్రష్టుపట్టడానికి కారకులెవరో అందరికీ తెలుసు. కెమెరా లేదనుకుని సాక్షాత్తూ స్వర్గీయ ఎన్టీఆర్‌నే ‘వాడూ...వీడూ’ అని తూలనాడిన ఘనుడు బాబు నుంచి పుత్రరత్నమైనా, మరొకరైనా నేర్చుకునే సంస్కృతి ఏముంటుంది? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు. అందుకే గుడికెళ్లి వస్తున్న అంబటిపై బూతులు లంకించుకొని రెచ్చగొట్టి, ఆయన తిరిగి తిట్టారని రెచ్చిపోయింది టీడీపీ ముఠా. సంస్కారం ఉంది గనుక క్షమించమని అడిగారాయన. ఆ మాట వెనక్కి తీసుకుంటున్నానన్నారు. కానీ పాపం పెరిగినట్టు పెరిగిన ఆ ముఠా అర్ధరాత్రి దాకా అల్లకల్లోలం సృష్టించింది. చివరకు అంబటినే ఖైదు చేయించింది. ఎంత విడ్డూరం?!
 
ఏం జరుగుతోంది ఏపీలో? ప్రశ్నించే తత్వాన్ని హత్యాయత్నాలతో, విధ్వంసాలతో చంపేస్తారా? ఈవీఎంల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకున్న అరాచకులు ఇక మారరా? ఇదే వారి నిర్ణయమైతే జనమే తొక్కి నార తీస్తారు. అదునుచూసి గుణపాఠం చెబుతారు. ప్రజాస్వామ్యంలో నారావారైనా, వేరేవారైనా ఇందుకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు.  

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)