Breaking News

మరికొన్ని గంటలు అదనంగా పనిచేయండి.. ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ రిక్వెస్ట్‌!

Published on Sun, 02/19/2023 - 13:17

గూగుల్‌ రూపొందించిన బార్డ్ ఏఐ చాట్‌బాట్‌లో లోపాలను సరిచేసేందుకు ఆ సంస్థ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సరికొత్త ప్రణాళికను రచించింది. ఇందుకోసం వారంలో కొన్ని గంటలు అదనంగా పనిచేయాలని గూగుల్‌ ఉద్యోగులను సీఈవో సుందర్ పిచాయ్ కోరారు. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గత సందేశాలు పంపినట్లు తెలిసింది.  బార్డ్ ఏఐ చాట్‌బాట్‌లో లోపాలను గుర్తించి సరిచేయడానికి వారానికి రెండు నుంచి నాలుగు గంటలు కేటాయించాలని కోరారు.

బిజినెస్‌ ఇన్‌సైడర్‌ కథనం ప్రకారం.. వేలాది మంది గూగుల్‌ ఉద్యోగులు ఇప్పటికే బార్డ్ ఏఐ చాట్‌బాట్‌ను వినియోగిస్తూ పరీక్షిస్తున్నారని, ఇందులో సమస్యలన్నంటినీ పరిష్కరించడానికి ఒక కొత్త ప్లాన్‌ను రూపొందించినట్లు సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. ఇందు కోసం వేలాదిమంది ఉద్యోగులు అదనపు గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంది. వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాక ఎటాంటి లోపాలు ఉండకూడదన్నది గూగుల్‌ ఉద్దేశం. అయితే సుందర్‌ పిచాయ్‌ ప్రపంచవ్యాప్తంగా మొత్తం గూగుల్‌ ఉద్యోగులందరికీ ఈ సందేశాలను పంపించారా.. లేదా అన్నది స్పష్టత లేదు.

గత వారంలో డెమో సమయంలో బార్డ్ బాట్ తప్పుడు సమాచారం ఇవ్వడంతో నెగిటివ్‌ ప్రచారం బాగా జరిగింది. గూగుల్‌ ఇటీవల తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 12 వేల ఉద్యోగాల కోత ప్రకటించిన విషయం తెలిసిందే.  మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌తో సంబంధం లేకుండా గూగుల్‌కు ప్రస్తుతానికి  ప్రపంచవ్యాప్తంగా 1.70 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 

సుందర్ పిచాయ్ పంపించిన సందేశాల్లో.. ఉద్యోగులందరూ బార్డ్‌ కోసం వారానికి రెండు నుంచి నాలుగు గంటలు అదనంగా, మరింత లోతుగా పనిచేసి లోపాలు సరిచేసేందుకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బార్డ్‌ని పరీక్షించడానికి ఈ వారంలో గణనీయమైన సమయాన్ని కేటాయించాలని ఈ-మెయిల్స్‌లో  పిచాయ్ అభ్యర్థించారు.

(ఇదీ చదవండి: రిషి సునాక్‌, బిల్‌గేట్స్‌ను ఇంటర్వ్యూ చేసిన చాట్‌బాట్‌.. ఏయే ప్రశ్నలు అడిగిందో తెలుసా?)

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)