Breaking News

‘ట్రంప్‌’ అలజడికి తట్టుకు​న్న ఒకేఒక్క ఇన్వెస్టర్‌..

Published on Mon, 04/07/2025 - 20:28

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రకటించిన టారిఫ్‌లను తట్టుకోవడానికి చాలా మంది ఇన్వెస్టర్లు ఇబ్బంది పడుతుంటే, వారెన్ బఫెట్ మాత్రం అమెరికా స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగిస్తున్నారు. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, జుకర్ బర్గ్, బెర్నార్డ్ అర్నాల్ట్ వంటి వారు వందల బిలియన్ డాలర్లు నష్టపోయారు. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లలో ట్రిలియన్ డాలర్లు ఆవిరైనా బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్ మాత్రం తన కంపెనీలో పెట్టుబడులతో బఫెట్ లాభాలను ఆర్జిస్తూనే ఉన్నారు.

ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఇప్పటివరకు 184 దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా వాల్ స్ట్రీట్ విలువ దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల మేర క్షీణించడంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లు దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేశాయి. 2020 మార్చిలో కోవిడ్ -19 మహమ్మారి తర్వాత ఇదే  అత్యంత భారీ పతనం.  అయితే ఈ ట్రెండ్ బఫెట్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపడం లేదు.  ఈ ఏడాది ఆయన తన సంపదకు 12.7 బిలియన్ డాలర్లు జోడించారు. ప్రస్తుతం బఫెట్‌ సంపద 155 బిలియన్ డాలర్లుగా ఉంది.

ముందస్తు ఆలోచనలతోనే.. 
బఫెట్‌ పతనం కాకుండా ఉండటానికి కొన్ని గణనాత్మక చర్యలు తీసుకున్నారు. బహుశా మార్కెట్ తిరోగమనం సంభవిస్తుందనే అంచనాతో ఆయన భారీ కొనుగోళ్లలో నగదును మదుపు చేయడం మానేశారు. 2024లో బుల్ మార్కెట్లు ఊగిసలాటలో ఉన్న సమయంలో బఫెట్ కంపెనీ ఈక్విటీల్లో 134 బిలియన్ డాలర్లను విక్రయించి 334 బిలియన్ డాలర్ల నగదుతో ఏడాదిని ముగించింది.

తన తోటి ఇన్వెస్టర్లు ఎదురుగాలులతో ఇబ్బందులు పడుతున్నప్పుడే బఫెట్ మెల్లగా యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి యూఎస్ టెక్ స్టాక్స్‌లో పెట్టుబడులను తగ్గించడం ద్వారా సాహసోపేతమైన చర్య తీసుకున్నారు. మరోవైపు జపాన్ ట్రేడింగ్ దిగ్గజాలపై మాత్రం ఆయన పెట్టుబడులు రెట్టింపు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో బఫెట్ జపాన్‌లోని ఐదు అతిపెద్ద వాణిజ్య సంస్థలైన మిట్సుయి, మిత్సుబిషి, సుమిటోమో, ఇటోచు, మరుబెనిలలో తన వాటాను పెంచుకున్నారు.

రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, బెర్క్‌షైర్ ఇప్పుడు మిత్సుయి అండ్ కోలో 9.82 శాతం, మిత్సుబిషి కార్ప్‌లో 9.67 శాతం, సుమిటోమో కార్ప్‌లో 9.29 శాతం, ఇటోచు కార్ప్‌లో 8.53 శాతం, మరుబెని కార్ప్‌లో  9.30 శాతం వాటాలను కలిగి ఉంది. ఈ పెట్టుబడులు బెర్క్ షైర్ హాత్వే మార్కెట్ క్యాప్ ను 1.14 ట్రిలియన్ డాలర్లకు మించి, టెస్లా వంటి అగ్రశ్రేణి కంపెనీలను అధిగమించేలా చేశాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)