Breaking News

టీసీఎస్‌లో భారీగా ఏఐ ఏజెంట్లు.. ఉద్యోగులతో కలిసే..

Published on Thu, 05/29/2025 - 09:02

ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) ఏదో ఆషామాషీ టెక్నాలజీ కాదని, మానవ జాతి పురోగమనాన్ని మలుపు తిప్పే ఒక శక్తివంతమైన సాధనమని ఐటీ దిగ్గజం టీసీఎస్‌ బోర్డు, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ చెప్పారు. అన్ని పరిశ్రమలకూ ఇది ప్రయోజనకరంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో కలిసి పనిచేసే ఏఐ ఏజెంట్లను భారీ స్థాయిలో రూపొందిస్తామని చంద్రశేఖరన్‌ చెప్పారు.

భవిష్యత్తులో ‘హ్యూమన్‌ ప్లస్‌ ఏఐ‘ మోడల్‌ కింద సర్వీసులు అందిస్తామని షేర్‌హోల్డర్లకు టీసీఎస్‌ మాతృ సంస్థ టాటా సన్స్‌కి కూడా చైర్మన్‌ అయిన చంద్రశేఖరన్‌ తెలిపారు. అలాగే, ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్‌ మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్‌ చేస్తామని చెప్పారు.

హార్డ్‌వేర్‌ ప్రొవైడర్లు, సొల్యూషన్స్‌ ఆవిష్కర్తలు, స్టార్టప్‌లతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటామని వివరించారు. ఏఐ సాంకేతిక వినియోగంలో టీసీఎస్‌ ముందు వరుసలో ఉంటోందని, పలు సొల్యూషన్స్‌లో దీన్ని ఉపయోగిస్తోందని చంద్రశేఖరన్‌ తెలిపారు. ‘టీసీఎస్‌ విజ్‌డంనెక్ట్స్‌’ పేరిట కంపెనీల కోసం జెన్‌ ఏఐ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

👉 ఇది చదివారా? జాబ్‌ చేంజ్‌ అంటే ఇదీ.. రూ.5.5 లక్షల నుంచి రూ.45 లక్షల జీతానికి..

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)