Breaking News

ఒక్కరోజే.. రూ.7.59 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి!

Published on Wed, 10/25/2023 - 07:32

ముంబై: మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతుండటంతో సోమవారం దేశీ సూచీలు క్షీణించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా ఒకే రోజున ఏకంగా రూ. 7.59 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా నాలుగు రోజుల వ్యవధిలో కీలక సూచీల పతనంతో బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 12,51,700 కోట్ల మేర హరించుకుపోయి రూ. 311,30,724 కోట్లకు క్షీణించింది.

వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సెన్సెక్స్‌ 826 పాయింట్లు (1.26%) క్షీణించి రూ. 64,572 వద్ద, నిఫ్టీ 261 పాయింట్లు (1.34%) తగ్గి 19,282 వద్ద క్లోజయ్యాయి. దసరా సందర్భంగా దేశీ మార్కెట్లు మంగళవారం పని చేయలేదు. గత బుధవారం నుంచి వరుసగా నాలుగు సెషన్లలో సెన్సెక్స్‌ 1,925 పాయింట్లు పతనమై కీలకమైన 65,000 మార్కు దిగువకు పడిపోయింది. నిఫ్టీ 530 పాయింట్లు తగ్గింది.

ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య ఉద్రిక్తతలకు తోడు ద్రవ్యోల్బణం, మరో దఫా వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు, అంతర్జాతీయంగా అనిశ్చితి మొదలైన వాటిపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొందని, మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనపడిందని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ (రిటైల్‌) హెడ్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ తెలిపారు. సెన్సెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, విప్రో, ఎస్‌బీఐ మొదలైనవి క్షీణించాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌ లాభపడ్డాయి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)