Breaking News

2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక

Published on Tue, 03/10/2026 - 15:59

ఒకవైపు ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, మరోవైపు భారీగా పతనమవుతున్న మార్కెట్లు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం వస్తుందని ఇందులో హెచ్చరించారు.

చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం గురించి నేను రిచ్ డాడ్స్ ప్రాఫసీ (2013)లో హెచ్చరించాను. అది రాబోతోంది. 2008లో ప్రపంచం ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీనిని గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని పిలుస్తారు. ఆ సమయంలో చాలా బ్యాంకులు & ఆర్థిక సంస్థలు కూలిపోయాయి. ముఖ్యంగా అమెరికాలోని పెద్ద పెట్టుబడి బ్యాంక్ అయిన లెమాన్ బ్రదర్స్ దివాళా తీసింది. భవిష్యత్తులో ఇంకా పెద్ద సంక్షోభం వచ్చే అవకాశం ఉందని కియోసాకి పేర్కొన్నారు.

కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 2026లో మరో పెద్ద ఆర్థిక సంక్షోభం సంభవించే అవకాశం ఉంది. ఈ పతనం ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆస్తి నిర్వహణ సంస్థలలో ఒకటైన 'బ్లాక్ రాక్'తో సంబంధం ఉన్న.. ప్రైవేట్ క్రెడిట్ వ్యవస్థ కారణంగా రావచ్చని ఆయన భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు భారీ అప్పుల్లో ఉన్నాయని, ఆ అప్పులను తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుందని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన వృద్ధుల సేవింగ్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం.. డబ్బును కాపాడుకోవాలంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం, ఆయిల్ వెల్స్ వంటి సహజ వనరులలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని చెబుతున్నారు.

నాకు వెండి అంటే చాలా ఇష్టమని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఎందుకంటే తక్కువ డబ్బుతో కూడా వెండిని కొనుగోలు చేయవచ్చని ఆయన అభిప్రాయం. కాబట్టి మీరు కూడా కేవలం 10 డాలర్లతో వెండి నాణేలు లేదా చిన్న ముక్కలు కొనుగోలు చేయండి. అవసరమైతే ఒక రోజు తినడం ఆపేసి.. వెండిపై పెట్టుబడి పెట్టండి. తప్పకుండా మీరు ధనవంతులు అవుతారని, జాగ్రత్త వహించండి, అని కియోసాకి తన ట్వీట్ పూర్తి చేశారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)