Breaking News

స్టాక్ మార్కెట్ కుప్పకూలబోతోందా?: బఫెట్‌పై.. కియోసాకి ఆగ్రహం

Published on Thu, 10/02/2025 - 13:13

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. వారెన్ బఫెట్ ఇటీవల బంగారం & వెండిని ప్రశంసించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎప్పుడూ స్టాక్ మార్కెట్, ఫండ్స్ వాణి వాటిలో పెట్టుబడి పెట్టాలని చెప్పే వారెన్ బఫెట్.. ఇప్పుడు బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. బఫెట్ కొత్త వైఖరి సాంప్రదాయ స్టాక్‌లు, బాండ్‌లకు పొంచి ఉన్న సంక్షోభాన్ని సూచిస్తుందని రాబర్ట్ కియోసాకి తీవ్రంగా స్పందించారు.

స్టాక్‌ మార్కెట్‌ మసకబారుతోందా?

కొన్నేళ్లుగా.. వారెన్ బఫెట్ బంగారం & వెండి వంటివి ఉత్పాదకత లేని ఆస్తులుగా పరిగణించారు. 2011లో బెర్క్‌షైర్ హాత్వే వాటాదారులకు రాసిన లేఖలో కూడా అయన బంగారం ఎక్కువగా ఉపయోగపడేది కాదని, అది లాభాలను తీసుకురాదని వ్యాఖ్యానించారు. వ్యాపారాలు, వ్యవసాయ భూములు, ఇండెక్స్ నిధులను నిజమైన రాబడిని చెబుతూ.. నమ్మకమైన పెట్టుబడులుగా పేర్కొన్నారు. కానీ ఆయనే ఇప్పుడు బంగారం & వెండిని ఆమోదించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

బఫెట్ ఒకప్పుడు బంగారాన్ని ఎగతాళి చేసినప్పటికీ, ఇప్పుడు దానిని పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ప్రశంసిస్తున్నాడు. ఇది బఫెట్ దృక్పథంలో గణనీయమైన మార్పును సూచిస్తుందని కియోసాకి అన్నారు. అంతే కాకుండా.. బఫెట్ మాట విని కొంత బంగారం, వెండి, బిట్‌కాయిన్ కొనాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. వారెన్ బఫెట్‌కు అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్‌గా పేరుంది. ఆయన ఎక్కువగా స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంటారు. దీంతో ఆయన్ను, ఆయన ఆలోచనలకు మంది అనుసరిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది స్టాక్‌ మార్కెట్‌లోకి వస్తున్నారు.  ఇప్పుడు మారిన బఫెట్‌ వైఖరితో స్టాక్‌ మార్కెట్‌ నుంచి వైదొలిగి బంగారం, వెండి వైపు పయనిస్తే స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు తగ్గి కుప్పకూలలే ప్రమాదముందా అంటూ కియోసాకి సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఇదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్!

డబ్బు దాచుకోవడం వల్ల పేదవాళ్లు అవుతారని, డబ్బును బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. మీ పెట్టుబడి పెరుగుతుందని రాబర్ట్ కియోసాకి చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు. వెండిపై పెట్టుబడి.. మీకు ఐదు రేట్లు లాభాలను తీసుకొస్తాయని ఆయన ఇటీవలే అన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)