Breaking News

రష్యా మాస్టర్‌ ప్లాన్‌.. ఇదే అదను!

Published on Tue, 03/10/2026 - 03:19

పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం మండిపోతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రిఫైనరీలు, ఆయిల్ స్టోరేజ్ డిపోలు ధ్వంసమవుతున్నాయి. హార్ముజ్ జలసంధి దాదాపు మూతపడింది. ప్రపంచంలో 20 శాతం చమురు సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది.  దీంతో మిడిల్ ఈస్ట్ నుంచి చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాలు తీవ్రంగా తగ్గాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లు దాటింది.. కొన్ని సమయాల్లో 119 డాలర్ల వరకు చేరింది.

ఈ సంక్షోభానికి సద్వినియోగం చేసుకోవాలని రష్యా భావిస్తోంది. "ఇదే అదను! చమురు ధరలు భారీగా పెరిగిన ఈ సమయంలో మన సరఫరాలను సద్వినియోగం చేసుకోవాలి!" అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారులకు స్పష్టం చేశారు. రష్యా ఇప్పటికే యూరప్‌కు సరఫరా చేస్తున్న గ్యాస్‌ను తగ్గించి.. లేదా పూర్తిగా ఆపేసి.. ఆ సరఫరాలను ఇతర మార్కెట్లకు (ఆసియా దేశాలు, భారత్ వంటివి) మళ్లించాలని సూచించారు.

"మనం ఇప్పుడే ఎక్కువ సరఫరాలు అవసరమయ్యే మార్కెట్లకు మా దృష్టిని మళ్లిస్తే.. అక్కడ అడుగు పెట్టవచ్చు" అని పుతిన్ చెప్పారు. యూరప్ దేశాలు రష్యా గ్యాస్‌పై ఆంక్షలు విధించాలని, 2027 నాటికి పూర్తిగా ఆపేయాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడే ఆ సరఫరాలను ఆపి.. ధరలు ఎక్కువగా ఇచ్చే కొత్త మార్కెట్లలో స్థానం సంపాదించుకోవచ్చనేది ఆయన వ్యూహం.

రష్యా ఆయిల్ (ఉరల్స్ క్రూడ్) ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గతంలో 40 డాలర్లకి పడిపోయిన ధర.. ఇప్పుడు 60 డాలర్లు పైగా ఉంది. కొన్ని మార్కెట్లలో బ్రెంట్ కంటే కూడా ప్రీమియంతో  అమ్ముడవుతోంది! ఇరాన్ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి పునరుద్ధరణకు నెలల తరబడి సమయం పడుతుందని పుతిన్ చెప్పారు. దీంతో రష్యా ఎనర్జీ ఎగుమతుల నుంచి భారీ ఆదాయం వస్తుంది.. అది ఉక్రెయిన్ యుద్ధ ఖర్చులకు కూడా సహాయపడుతుంది.

ఈ 'మాస్టర్ ప్లాన్'తో రష్యా ఆర్థికంగా బలపడుతుందా.. లేక యూరప్ ఎనర్జీ సంక్షోభం మరింత తీవ్రమవుతుందా? ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)