Breaking News

ఆ భయం నాకూ ఉంది: AIపై ఆంథ్రోపిక్ సీఈఓ ఆందోళన

Published on Thu, 06/11/2026 - 18:53

కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి మానవ సమాజానికి అపార అవకాశాలు తెస్తున్నప్పటికీ, అదే సమయంలో తీవ్రమైన ప్రమాదాలకు కూడా దారితీయవచ్చని ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోడేయి (Dario Amodei) హెచ్చరించారు. “ఏదో ఒక సమయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉందనే ఆందోళన నాకూ ఉంది” అంటూ ఆయన తాజా బ్లూమ్‌బర్గ్ డాక్యుమెంటరీలో వ్యాఖ్యానించారు.

ఏఐ భద్రత అంశంపై చాలా కాలంగా గళం విప్పుతున్న అమోడేయి, ప్రపంచవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాలు ప్రభుత్వాల నియంత్రణ సామర్థ్యాన్ని మించిపోయే వేగంతో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో నిర్వహించిన సర్వేల ప్రకారం, సగానికి పైగా ప్రజలు ఏఐ కారణంగా ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు.

“స్వచ్ఛంద నియంత్రణ సరిపోదు”

ఏఐ కంపెనీలు స్వయంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తామని చెప్పడం మాత్రమే ఇక సరిపోదని అమోడేయి అభిప్రాయపడ్డారు. తాజాగా విడుదల చేసిన తన విధాన వ్యాసంలో, అత్యాధునిక “ఫ్రంటియర్ ఏఐ” మోడళ్లను విడుదల చేసే ముందు తప్పనిసరిగా స్వతంత్ర థర్డ్‌ పార్టీ సంస్థల ద్వారా పరీక్షించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ దాడులు, జీవాయుధాల అభివృద్ధి, మానవ నియంత్రణను దాటిపోయే స్వయంప్రతిపత్తి వంటి ప్రమాదాలను అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో మోడళ్లు విఫలమైతే, వాటి విడుదలను నిలిపివేసే లేదా పూర్తిగా నిరోధించే అధికారం ప్రభుత్వాలకు ఉండాలని ఆయన వాదించారు.

ఓపెన్‌ఏఐతో విభేదాలూ ఇందుకే..

ఒకప్పుడు ఓపెన్‌ఏఐ (OpenAI)లో కీలక పరిశోధకుడిగా పనిచేసిన అమోడేయి, ఏఐ భద్రత అంశాలపై విభేదాల కారణంగా సంస్థను విడిచి ఆంథ్రోపిక్‌ను స్థాపించారు. వాణిజ్య ప్రయోజనాలు, వేగవంతమైన ఉత్పత్తి విడుదల కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన వైఖరి. ఇదే సమయంలో ఓపెన్‌ఏఐ కూడా ఏఐ రిస్క్‌లపై తామూ స్పష్టమైన అవగాహనతో ఉన్నామని, “ప్రతిదీ పూర్తిగా ఆటోమేట్ కావడం మాకు కావలసిన భవిష్యత్తు కాదు” అని ఇటీవల వెల్లడించింది. ఏఐ వల్ల భారీ ఉత్పాదకత పెరుగుదల సాధ్యమైనప్పటికీ, ఉద్యోగాలపై దాని ప్రభావం, సామాజిక పరిణామాలను నిర్లక్ష్యం చేయరాదని పరిశ్రమ నాయకులు అంగీకరిస్తున్నారు.

భారత్‌లోనూ నియంత్రణ ఆలోచన

ఏఐ నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు వేగంగా జరుగుతున్న వేళ, భారత్‌ కూడా ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని గుర్తిస్తోంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) ఇటీవల మాట్లాడుతూ, 2000 నాటి ఐటీ చట్టం ఆధునిక ఏఐ యుగానికి సరిపోదని, ఆవిష్కరణకు ప్రోత్సాహం ఇస్తూనే పౌరుల భద్రతను కాపాడే కొత్త విధానాలు అవసరమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’

Videos

11 టీమ్ కెప్టెనే ఏపీకి దిక్కు లోకేష్ కు పేర్ని కిట్టు కౌంటర్ అదుర్స్

లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు, పవన్ ఆంధ్రా మోసగాడు..

భారీగా పెరిగిన స్టాక్ జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు

వెన్నుపోటుకు రెండేళ్లు YSRCP నిరసన

అమెరికా సంబంధం అని పెళ్లి చేసుకుంటే?

నందూస్ వరల్డ్‌పై భారీ ఆరోపణలు, తవ్వే కొద్దీ బయటకొస్తున్న మోసాలు

రేయ్ జేసీ...? నువ్వు నన్ను ఆపగలనని అనుకుంటున్నావా..?!

ఆ రోజు సూర్యుడు మాయం, శతాబ్దంలోనే అతిపెద్ద వింత!

నువ్వు OG కాదు.. పెద్ద క్యాబేజీ

సిగుండాలి... ఏం పీకారని విజయోత్సవ సభ

Photos

+5

చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు.. వైఎస్సార్‌సీపీ సమర శంఖం (ఫొటోలు)

+5

కొత్త మలుపు మూవీతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్న భైరవి (ఫొటోలు)

+5

టైటిల్ వేటకు సిద్ధమైన భారత మహిళలు...

+5

‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)

+5

ఫుట్‌బాల్ జాతర షురూ.. అట్టహాసంగా ఫిఫా ఆరంభ వేడుకలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

‘దీవానా’ మూవీ ట్రైలర్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

'రాను బొంబాయికి రాను లిఖిత 'సాV3' మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శ్రీదేవి అందాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌ బర్త్‌ డే పార్టీలో నమ్రతా, మంచు లక్ష్మీ సందడి (ఫోటోలు)