Breaking News

వణికిస్తున్న సీఈవో వార్నింగ్‌..

Published on Mon, 06/23/2025 - 19:47

అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ  తమ 15 లక్షల మంది ఉద్యోగులను భవిష్యత్తు గురించి హెచ్చరించారు. రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సు సంస్థలోని శ్రామిక శక్తిని సమూలంగా మార్చేస్తుందని చెప్పారు. ఏఐ ఏజెంట్లు, జనరేటివ్ ఏఐ వ్యవస్థలు ప్రస్తుత అనేక ఉద్యోగాల్లో మానవ ఉద్యోగుల అవసరాన్ని తగ్గిస్తాయని కంపెనీవ్యాప్తంగా ఉద్యోగులందరికీ పంపిన మెమోలో జాస్సీ ప్రకటించారు. ‘ఈ రోజు చేస్తున్న కొన్ని పనులకు భవిష్యత్తులో మాకు ఎక్కువ మంది అవసరం ఉండదు" అని అమెజాన్ సీఈవో అన్నారు.

ఈ పరివర్తన రాబోయే కొన్ని సంవత్సరాలలో "మా మొత్తం కార్పొరేట్ శ్రామిక శక్తిని తగ్గిస్తుంది" అని కంపెనీ ఆశిస్తోందని జూన్ 17 నాటి మెమోలో ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ఈ ప్రకటన అమెజాన్‌లోని సాఫ్ట్‌వేర్‌  ఇంజనీరింగ్, మార్కెటింగ్, ఇతర వైట్-కాలర్ స్థానాల్లో పనిచేస్తున్న 3.5 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, పరిశోధన, కోడింగ్, ఆటోమేషన్ వంటి సంక్లిష్ట పనులు చేయగల స్వయంప్రతిపత్తి కలిగిన సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు ఆధిపత్యం చెలాయించే భవిష్యత్తును జాస్సీ చిత్రించారు. షాపింగ్ నుంచి ట్రావెలింగ్‌ వరకూ ప్రతి రోజువారీ పనిని నిర్వహించే ఈ ఏజెంట్లు ప్రతి రంగంలోనూ, ప్రతి కంపెనీలోనూ ఉంటారని జాస్సీ జోస్యం చెప్పారు.

ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న లేదా చేపట్టబోతున్న 1,000 కిపైగా జనరేటివ్ ఏఐ సేవలు, అనువర్తనాలను ప్రస్తావిస్తూ కంపెనీ విస్తృత ఏఐ ఇంటిగ్రేషన్‌ను జాస్సీ హైలైట్ చేశారు. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ఉన్నప్పటికీ, మార్పులను స్వీకరించడానికి సిద్ధపడే ఉద్యోగులకు వీటిని అవకాశంగానూ ఆయన అభివర్ణించారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పట్ల ఆసక్తిగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని, వర్క్ షాప్ లకు హాజరుకావాలని, శిక్షణలు తీసుకోవాలని సూచించారు.  సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వారే అధిక ప్రభావాన్ని చూపగలరని హిత బోధ చేశారు.

👉 ఇది చదివారా? టీసీఎస్‌ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)