Breaking News

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిడ్నాప్‌

Published on Wed, 10/21/2026 - 07:29

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ ఆగ‌డాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. వైఎస్సార్ సీపీ అభ్య‌ర్థుల‌ను నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకోవ‌డ‌మే కాకుండా దాడులు, దౌర్జ‌న్యాల‌కు ప‌చ్చ మూక‌లు తెగ‌బ‌డుతున్నాయి. కొన్నిచోట్ల కిడ్నాప్‌ల‌కు సైతం దిగారు. పోలీసుల‌, అధికారుల‌తో కుమ్మ‌క్కై టీడీపీ శ్రేణులు చేస్తున్న అరాచ‌కాల‌కు అడ్డే లేకుండా పోతోంది. అధికార పార్టీ అక్ర‌మాల‌ను వైఎస్సార్‌సీపీ నాయ‌కులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. 

విశాఖ పశ్చిమ నియోజకవర్గం 
జీవీఎంసీ వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి కామెంట్స్‌

  • జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా జగనన్న నాకు అవకాశం ఇచ్చారు.. 
  • సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నాను.. 
  • ప్రజా సేవ చెయ్యడమే నాకు ఇష్టమైన పని.. 
  • విశాఖ ప్రజలు విజ్ఞతను చూపించే సమయం ఆసన్నమైంది.. 
  • విశాఖను కూటమి ప్రభుత్వం ధ్వంసం చేస్తుంది.. 
  • మన అందరి సెంటిమెంట్ అయిన స్టీల్ ప్లాంట్ కూటమి పాలకులు వదిలేశారు.. 
  • విశాఖలో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది.. 
  • నన్ను మేయర్ గా ఎన్నుకుంటే తాగు నీటి సమస్య లేకుండా చేస్తాను..
  • 99 పైసలకే భూములను కట్టబేడుతున్నారు.. 
  • 55 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంపీ కబ్జా చేశారు.. 
  • సింహాచలం కొండలను ధ్వంసం చేస్తున్నారు.. 
  • డ్రగ్స్, గంజాయి, మద్యం విచ్చలవిడిగా విక్రయాలు చేస్తున్నారు.. 
  • నేను మేయర్ అయితే మహిళల భద్రతకు పెద్దపీట వేస్తాను.. 
  • నేను మేయర్ అయితే సమస్యల పరిష్కారానికి మీ వద్దకే అధికారులతో సహా వస్తాను.. 
  • ఫిర్యాదులు చేసేందుకు మీరు ఎవ్వరూ జీవీఎంసీ రావాల్సిన అవసరం లేదు.. 
  • జీవీఎంసీ సొమ్ముని కూటమి ప్రభుత్వం రూ. 1750 కోట్లు అమరావతికి తరలించారు.. 
  • మేము కట్టిన పన్నులు ఎప్పుడు తిరిగి ఇస్తారని కూటమి అభ్యర్థులను అడగండి.. 
  • నిజాయితీతో కూడిన స్వచ్ఛమైన పాలన అందిస్తాను నన్ను అందరూ దీవించండి..

వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థిపై టీడీపీ రౌడీల దాడి

  • చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవీ ప్రకాష్‌పై దాడి
  • చిత్తూరు జడ్పీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు వేయడానికి వెళ్లిన ప్రకాష్‌ను టీడీపీ గూండాలు అడ్డుకొని దాడి చేశారు
  • నామినేషన్ పత్రాలను చింపి వేశారు, ఈ దాడిలో ప్రకాష్‌కి తీవ్ర గాయాలు కావ‌డంతో ఆసుపత్రికి తరలించారు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిడ్నాప్‌

  • విశాఖప‌ట్నం: 14 వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డి జీవన్ కిరణ్మయి కిడ్నాప్
  • కిరణ్మయిని కిడ్నాప్ చేసిన టీడీపీ కూటమి గూండాలు
  • కిడ్నాప్ చేసి విత్ డ్రా  ఫాంపై బలవంతంగా సంతకాలు
  • అభ్యర్థి లేకుండానే విత్ డ్రా  ఫామ్ ఎన్నికల అధికారులకు సమర్పించిన కూటమి నేతలు
  • కూటమి నేతలు ఇచ్చిన పత్రాలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విత్ డ్రా అయినట్లు ప్రకటించిన ఎన్నికల అధికారులు

తాడేపల్లి: సజ్జల రామకృష్ణారెడ్డి, స్టేట్ కో-ఆర్డినేటర్ కామెంట్స్

  • స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు ప్రభుత్వం వికృత క్రీడగా మార్చింది.
  • మున్సిపల్ ఎన్నికల్లో సాగించిన అరాచకాలనే ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగిస్తున్నారు.
  • మా పోరాటం టీడీపీతో కాదు.. టీడీపీ కనుసన్నల్లో నడుస్తున్న పోలీసు అధికారులతోనే.
  • చంద్రబాబు, ఆయన కుమారుడి దర్శకత్వంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అరాచకాలు జరుగుతున్నాయి.
  • నామినేషన్లు వేయనిస్తే ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
  • నామినేషన్లు వేయడానికి వెళ్లేవాళ్లు దాడులు చేస్తారా? నామినేషన్లు అడ్డుకునేవాళ్లు దాడులు చేస్తారా?

అంబటి రాంబాబు వ్యాఖ్యలు

  • సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది
  • డీజీపీ పచ్చబట్టలు వేసుకుని పాలన చేస్తున్నారు
  • చంద్రబాబు ప్రభుత్వంలో నామినేషన్‌ కేంద్రాల ఆక్రమణలు సిగ్గుచేటు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకుంటూ కేసులతో వేధిస్తున్న పోలీసులు


విశాఖపట్నం
బొత్స సత్యనారాయణ కామెంట్స్‌

  • ప్రజాస‍్వామ్యం మీద కూటమికి నమ్మకం లేదు 
  • సుప్రీంకోర్టు ఆదేశించినా సరే దౌర్జన్యాలు జరుగుతున్నాయి 
  • మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా?
  • న్యాయపరంగా పోరాడతాం
  • ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు
  • పోలీసులను చెప్పుచేతల్లో పెట్టుకుని దుశ్చర్యలకు పాల్పడుతున్నారు
  • కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది
  • నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి
  • కూటమి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు
  • పోలీసుల అండతో వెన్నుపోటు పార్టీ గూండాలు రెచ్చిపోతున్నారు
  • కూటమి నేతల ప్రవర‍్తనపై జాలేస్తోంది

    విజయవాడ
  • కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌
  • మున్సిపాలిటీల్లో నమోదైన కేసుల వివరాలు కోరిన ఎస్‌ఈసీ
  • ఘటనలపై సాయంత్రానికి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం

‍కూటమిపై మార్గాని భరత్‌ ఫైర్‌ 

  • నామినేషన్లపై కూటమి ప్రభుత్వ తీరు దారుణం
  • సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది
  • పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చు
  • సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్‌ఈసీ అమలు చేయాలి

సుప్రీంకోర్టు ఆదేశాలపై గుడివాడ అమర్నాథ్‌..

  • సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు
  • ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి రావాలి
  • పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి
     

సుప్రీంకోర్టు ఆదేశాలపై పెద్దిరెడ్డి స్పందన 

  • అన్యాయాలు చేస్తు‍న్నారు కాబట్టే సుప్రీంకోర్టు స్పందించింది
  • అధికారులు నామినేషన్లు తీసుకోవడం లేదు
  • రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదు
  • టీడీపీ నేతలు దాడులు చేస్తే బాధితులపైనే కేసులు పెట్టారు
  • వందలాది మందిపై అక్రమ కేసులు పెట్టారు
  • సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా అధికారులకు బుద్ధి రావాలి: పెద్దిరెడ్డి

పల్నాడు జిల్లా

  • మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కామెంట్స్‌..
  • పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ అరాచకాలు చేస్తోంది.
  • మాచర్ల నియోజకవర్గంలో నామినేషన్ వేసేందుకు సిద్ధపడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై గంజాయి కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.
  • టీడీపీ చెంచాలు మహిళలపై దాడులు చేస్తున్నారు.
  • టీడీపీ గూండాలకు దమ్ముంటే పోలీసులు లేకుండా మా ఎదురుగా రావాలి.
  • కార్యకర్తల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం.
  • వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలపై దాడులు చేసిన ఎవరినీ వదలం.
  • టీడీపీకి వత్తాసు పలికే ఏ పోలీసును భవిష్యత్తులో వదలం.
  • జగనన్న ఆదేశాల మేరకు ప్రతీ చోటా నామినేషన్ వేసేందుకే ముందుకు వెళ్తాం.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయం.
  • ఎన్నికల సంఘం టీడీపీతో కుమ్మకు అయింది.
  • జరుగుతున్న అరాచకాలపై హైకోర్టుకు వెళ్తాం.
  • మా కార్యకర్తలపై దాడి చేసిన టీడీపీ గూండాలను వదిలిపెట్టం.


పల్నాడు జిల్లా..

  • దాచేపల్లిలో ఉద్రిక్తత
  • నామినేషన్ సెంటర్ మార్చడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నిరసన
  • మండల పరిషత్ కార్యాలయం వరకు నిరసన  ర్యాలీ
  • ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు.
  • పోలీసులకు, వైఎస్సార్‌సీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం.
  • నామినేషన్ పత్రాలు అంబేద్కర్ విగ్రహానికి ఇచ్చి నిరసన తెలిపిన ఎంపీటీసీ అభ్యర్థులు.

నంద్యాల జిల్లా..

  • డోన్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద పాగా వేసిన పచ్చ మూక.
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్దులు బీఫామ్‌ సమర్పించడానికి వచ్చే వారిని అడ్డుకోవాలని కుట్ర.
  • పక్క నియోజకవర్గం నుంచి భారీగా వచ్చిన పచ్చ మూకలు.
  • మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.

ప్రకాశం జిల్లా

  • సింగరాయకొండ మండలంలో టీడీపీ నాయకుల గూండాగిరి
  • నామినేషన్ కోసం వెళుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్న టీడీపీ నాయకులు
  • సీఐ శ్రీహరి సమక్షంలోనే వైఎ‍స్సార్‌సీపీ అభ్యర్దుల నామినేషన్ పత్రాలు లాక్కొని చించి వేసిన టీడీపీ నేతలు

విజయవాడ..

  • సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్‌ఈసీ కీలక సమావేశం
  • 19 స్థానాల్లో నామినేషన్ల గడువు పెంపుపై రివ్యూ
  • ఈనెల 25 వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దన్న సుప్రీంకోర్టు.
  • ఆయా స్థానాల్లో జరిగిన ఘటనలు, కేసుల అంశంపై చర్చ. 

పల్నాడు జిల్లా..

  • హౌస్ అరెస్టును ఖండించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు, నామినేషన్ వేయనివ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం
  • పోలీసు స్టేషన్‌కు భారీ ర్యాలీగా బయలుదేరిన పిన్నెల్లి
  • మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత
  • టీడీపీ అరాచకాలపై పిన్నెల్లి తీవ్ర ఆగ్రహం
  • పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన పిన్నెల్లి
  • టీడీపీ అరాచకాలు చేస్తున్నా ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంపై మండిపాటు

చిత్తూరు

  • చిత్తూరు జిల్లాలో దళిత నేతపై టీడీపీ గూండాల దాడి
  • మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై టీడీపీ గూండాల దాడి
  • జడ్పీటీసీ నామినేషన్‌కు వచ్చిన నారాయణ స్వామిపై దాడి.

 

తిరుపతి జిల్లా:

  • చిట్టమూరులో కూటమి నేతల బరితెగింపు
  • నామినేషన్ సెంటర్ వద్దకు ఎవరిని రానివ్వకుండా అడ్డుకుంటున్న తెలుగుదేశం గుండాలు
  • నామినేషన్ సెంటర్ వద్ద కర్రలతో బైటాయింపు
  • అధికార పార్టీ నాయకులకు అండదండగా పోలీసులు
  • గూడూరు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న కూటమి నేతలు

కడపలో ఉద్రిక్తత..

  • కడప వైఎస్సార్‌సీపీ ఆఫీసు నుంచి నామినేషన్లు వేయడానికి బయలుదేరిన నేతలు.
  • వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు.
  • నామినేషన్లు వేయకుండా వైఎస్సార్‌సీపీ ఆఫీసు వద్దే వారి ఆపేసిన పోలీసులు.
  • ఎంపీ అవినాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి సహా వైఎస్సార్‌సీపీ నేతల అడ్డగింత.
  • అవినాష్‌ రెడ్డి కామెంట్స్‌..
  • ఉదయం నుంచి మా వాళ్ల మీద ఆంక్షలు పెట్టారు.
  • పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరే తీసుకెళ్లి నామినేషన్లు వేయించండి.
  • పోలీసులు ఎందుకున్నారు?.
  • టీడీపీ నేతలు స్వేచ్చగా నామినేషన్లు వేసుకుంటున్నారు.
  • నామినేషన్లకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు.
  • ఆడవాళ్లు అని కూడా చూడకుండా నామినేషన​్‌ పేపర్లు లాక్కుంటున్నారు.
  • నామినేషన్లు వేసే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు.  
     

అన్నమయ్య జిల్లా:

  • పుంగనూరు నియోజకవర్గం పరిధిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరింపులు
  • పుంగనూరులో ఎంపీటీసీ నామినేషన్ కేంద్రం వద్ద భారీగా పోలీసుల మోహరింపు..
  • నామినేషన్ కేంద్రం వద్ద ఇనుప కంచెలుతో భద్రత ఏర్పాట్లు
  • నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు..

వైఎస్సార్ జిల్లా..

  • కడప జిల్లా పరిషత్ కార్యాలయం పరిసరాల్లో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి
  • ఇప్పటికే జిల్లా పరిషత్ వద్ద వందలాది మంది టీడీపీ మూకలు
  • జడ్పీటీసీ నామినేషన్లను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున అరాచకం
  • పూర్తిగా అరాచక మూకలకు సహకరిస్తున్న పోలీసులు

విజయవాడ..

  • కరకట్ట నుండే కుట్ర ప్లాన్‌
  • సీఎంవో నుండే మొత్తం ఆపరేషన్
  • జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ హైజాక్
  • పోలీసులు అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు
  • విజయవాడ నుండి ఉన్నతాధికారులు ఆదేశాలు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పోలీసులే అక్రమ నిర్బంధాలు
  • కడప, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, ఒంగోలు, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో పోలీసుల ద్వారా కుట్రలు
  • మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లు ఉపసంహరణకు పోలీసులతో బెదిరింపులు
  • టీడీపీ చేతిలో కీలుబొమ్మలా మారిన పోలీసు వ్యవస్థ
  • ఎన్నికల ప్రక్రియను అరాచకంతో అపహాస్యం చేస్తున్న టీడీపీ

చిత్తూరు జిల్లా..

  • కుప్పం మున్సిపాలిటీలో నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బెదిరింపులు
  • కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ బరిలో 14 మంది అభ్యర్థులు
  • మొత్తం 18 నామినేషన్లు దాఖలు, 4 అభ్యర్థులు నామినేషన్లు తిరస్కరణ, 14 నామినేషన్లు ఆమోదం
  • వైఎస్సార్‌సీపీ-6, టీడీపీ-6, కాంగ్రెస్-1, బీఎస్పీ-1 మంది అభ్యర్థులు నామినేషన్లు అర్హత
  • వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్ధి విజయ్ కుమార్‌ను బెదిరించిన టీడీపీ
  • ఉదయం 9.30 గంటలకు కిడ్నాప్ చేసి, సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేసిన టీడీపీ గూండాలు
  • కుప్పంలో ఓటమి భయంతోనే ఇలాంటి బెదిరింపులు
  • ఈరోజు మధ్యాహ్నం 3 గంటలు వరకు విత్ డ్రా అవకాశం
  • మధ్యాహ్నం 3 గంటలు తరువాత పోటీలో నిలిచిన అభ్యర్థులు జాబితా ప్రకటన


ప్రకాశం జిల్లా.. 
పోలీసుల తీరు పై  అద్దంకి వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ డాక్టర్ అశోక్  కుమార్ ఆగ్రహం

పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్న టీడీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తున్నారు

మా అభ్యర్థులను నామినేషన్ ఉపసంహరించుకోమని పోలీసులు బెదిరిస్తున్నారు

ఇవ్వాలా ఎన్ని అరాచకాలు చేయాలో చేయండి.. రేపు మారోజు వచ్చినప్పుడు... అలాంటి పోలీసులు సంగతి చూస్తాం.

ఎవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు

 

కర్నూలు జిల్లా..

  • చిప్పగిరిలో ఎమ్మెల్యే విరూపాక్షిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు..
  • ఓటమి భయంతో ముందస్తు అరెస్టు చేయించిన టీడీపీ.
  • ఎమ్మెల్యే సోదరులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ ప్రారంభం కాక ముందే అరెస్టులు.
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భయపెట్టేందుకు ముందస్తు అరెస్ట్


వైఎస్సార్ జిల్లా

  • వేంపల్లిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి హౌస్ అరెస్ట్
  • వీరబల్లిలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌.
  • మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి హౌస్ అరెస్ట్.
  • కాజీపేట మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ రఘు అరెస్ట్.
  • నామినేషన్ వేయించేందుకు రోడ్డుపైకి వచ్చిన రఘుని బలవంతంగా జీపులో ఎక్కించుకొని స్టేషన్ తరలించిన ఖాజీపేట సీఐ.

ఇదీ ఒక గెలుపేనా: అవినాష్‌ రెడ్డి ఫైర్‌

  • వైఎస్సార్ జిల్లా..
  • పులివెందులలో పచ్చమూకలు దాడి చేసిన ప్రదేశాన్ని పరిశీలించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
  • కౌన్సిలర్ అభ్యర్ధుల ఇంటిపై బీరు బాటిళ్లతో దాడి, వాహనాలు దగ్దం
  • దగ్ధమైన వాహనాలను పరిశీలించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
  • వారం రోజులుగా టీడీపీ గూండాలు, పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు
  • వాహనాల ధ్వంసం, షాపుల దగ్డంతో పాటు కాల్పులు చేస్తున్నారు
  • తాము గెలవలేమని తెలిసి ఇలా అరాచకాలకు తెరలేపారు
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మా పార్టీ లీడర్లందరినీ అరెస్టులు చేస్తున్నారు
  • నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు అరెస్టుల పర్వానికి తెరలేపారు
  • మా పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టీ ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు
  • ఇన్ని అరాచకాలు చేసి గెలిచే గెలుపును ఒక గెలుపు అంటారా?

నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు..

  • ఏపీలో నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు..
  • ఎంపీటీసీ-9829, జడ్పీటీసీ-659 స్థానాలకు ఎన్నికలు.
  • ఈనెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న స్క్రూటినీ
  • ఈనెల 27 వరకు నామినేషన్ల విత్‌డ్రాకు గడువు.
  • నవంబర్‌ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్‌.
  • నవంబర్‌ 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

తిరుపతిలో కొనసాగుతున్న దౌర్జన్యకాండ

  • తిరుపతి జిల్లాలో టీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది.
  • జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లను అడ్డుకునేందుకు కుట్రలు.
  • రైల్వేకోడూరులో 500 మంది గూండాలను సిద్ధం చేసిన కూటమి నేతలు
  • నామినేషన్‌ సెంటర్ల వద్ద మోహరించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునే కుట్ర.
  • ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న నామినేషన్లు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా దాడులకు ప్లాన్‌.
  • ఏకగ్రీవాలు చేసుకోవాలని దాడులకు తెగబడుతున్న కూటమి నేతలు.
  • మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లలో వ్యవహరించిన తీరుగానే మళ్లీ రిపీట్‌ చేస్తున్న కూటమి నేతలు. 

వైఎస్సార్ జిల్లా...

  • బద్వేల్ నియోజకవర్గంలో పోలీసులను అడ్డుపెట్టుకుని కొనసాగుతున్న టీడీపీ అరాచకాలు..
  • ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఇండ్ల వద్దకు చేరుకున్న పోలీసులు.
  • జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన నాయకులను పలు పోలీస్ స్టేషన్లకు తరలింపు.

 

👉ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టార్గెట్‌ చేసి దాడులు చేస్తున్నారు. అరాచకాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారు.  

పల్నాడు జిల్లా..

  • మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్

  • జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కోసం నామినేషన్ సందర్భంగా పిడుగురాళ్ల వైఎస్సార్‌సీపీ ఆఫీసులో ఉన్న కాసు మహేష్ రెడ్డి

  • పిడుగురాళ్ల పార్టీ ఆఫీసు వద్ద భారీ స్థాయిలో పోలీసుల మొహరింపు

  • పిడుగురాళ్ల పార్టీ కార్యాలయంలో కాసు మహేష్ రెడ్డిని అరెస్ట్ చేసి నరసరావుపేట ఇంటికి తరలించిన పోలీసులు

వైఎస్సార్ జిల్లా

  • పులివెందులలో అర్ధరాత్రి టీడీపీ అరాచకం

  • మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన నిరంజన్ రెడ్డి, అంజనప్ప ఇళ్లపై దాడి

  • నిరంజన్ రెడ్డి ఇంటిపై బీరు బాటిళ్లతో దాడి

  • ఇంటి ముందు ఉన్న లారీ తగలబెట్టిన పచ్చ మూకలు

  • అంజనప్ప ఇంటి వద్ద స్కూటీని దగ్దం చేసిన టీడీపీ గూండాలు

  • నామినేషన్ వేసిన వారిని ప్రచారం చేసుకోనివ్వకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్న టీడీపీ

 

పోరుమామిళ్ల పోలీసుల ఓవరాక్షన్

  • మండలంలోని ముఖ్యమైన వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు

  • జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా ఎక్కడికి అక్కడ అరెస్టు చేస్తున్న పోలీసులు

  • కొండాపురం మండలం జడ్పీటీసీ అభ్యర్థి శివారెడ్డిని అరెస్టు చేసి తాళ్ల పొద్దుటూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు

  • వైఎస్సార్‌సీపీ నాయకుడు హరి నారాయణ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు

  • ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో ఎంపిటీసీ అభ్యర్థి కల్లూరు నాగేంద్ర రెడ్డి అరెస్టు చేసిన పోలీసులు

 

రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం..

  • రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ గూండాల బీభత్సం

  • వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్ధులపై అక్రమ కేసులు

  • అర్ధరాత్రి నుండి అరెస్టులు చేస్తున్న పోలీసులు

  • నామినేషన్లు దాఖలు చేయకుండా అభ్యర్ధులను ఎత్తుకెళ్తున్న పోలీసులు

  • పోటీ చేసే అభ్యర్ధులకు టీడీపీ నేతల వార్నింగ్‌.

ఇదీ చదవండి: పోలీసులు కాల్పులు జరిపి, రాళ్లతో దాడి చేశారు: సజ్జల

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)