Breaking News

‘ఇది బాబు ప్రజా వ్యతిరేక విధానాలపై ఇచ్చిన ఘనమైన తీర్పు’

Published on Mon, 12/15/2025 - 21:19

తాడేపల్లి : మెడికల్‌ కాలేజీలప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కోటి సంతకాల సేకరణ అనంతరం వాటిని జిల్లా కేంద్రాల నుండి తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి తరలింపులో భాగంగా  ఈరోజు(డిసెంబర్చే‌ 15వ తేదీ) చేపట్టిన ర్యాలీలు విజయవంతం కావడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన  ఉద్యమం మాత్రమే కాదని, చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు అని అన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌

ఇది అత్యంత విజయవంతమైన ఉద్యమం
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఒక కోటి సంతకాల ఉద్యమం అత్యంత విజయవంతమైనదిగా వైఎస్‌ జగన్‌ అభివర్ణించారు. ‘ఇది చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చాటుతున్నాయి. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన  ఉద్యమం మాత్రమే కాదు. చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. ప్రజాప్రయోజనాలను ఫణంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ  ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, ఒక కోటికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు.  

 ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణ
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. సేకరించిన ఒక కోటి సంతకాల పత్రాలు ప్రస్తుతం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అక్కడి నుంచి డిసెంబర్‌ 18న గౌరవ గవర్నర్‌గారికి  అధికారికంగా సమర్పిస్తాం. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగాధికారికి  చేరి, అనంతరం అది న్యాయస్థానాల తలుపులు తడుతుంది. 

ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైఎస్సార్‌సీపీ నాయకుడు, పార్టీ కార్యకర్తలు, అలాగే స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో  మీ భాగస్వామ్యం ద్వారా ప్రజా ఆస్తులను ప్రైవేట్‌కు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. ఈ ఉద్యమం ద్వారా  చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను అమ్మేయాలన్న ఆయన ప్రయత్నాన్ని, ఆయన నిర్ణయాలను, ఆయన పాలనను ఒక కోటి మంది ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.. ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలి’ అని అన్నారు.

 

ఇవీ చదవండి:

కోటి సంతకాలు.. కోట్ల గళాలు

విజయవాడకు వైఎస్‌ జగన్‌

ఇదీ కదా ప్రజా ఉద్యమం అంటే..
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)