Breaking News

బాబు సర్కార్‌ కక్ష సాధింపు.. మరోసారి నందిగం సురేష్‌ అరెస్ట్‌

Published on Sun, 05/18/2025 - 15:24

గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మరోసారి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు నిన్న(శనివారం) నందిగం సురేష్ ఇంటి దగ్గర తాగి వీరంగం సృష్టించాడు. నందిగం సురేష్‌ కుటుంబ సభ్యులను దూషించిన రాజు.. సురేష్‌ను చంపేస్తే తనకున్న ఆస్తుల్లో కొంత భాగం రాసిస్తానంటూ హడావుడి చేశాడు.

నందిగం సురేష్ కార్లపైన రాజు దాడి చేశాడు. ఎందుకు వీరంగం సృష్టిస్తున్నావంటూ రాజును నందిగం సురేష్ అనుచరులు ప్రశ్నించారు. దీంతో రాజు, నందిగామ సురేష్ అనుచరులకు మధ్య గొడవ జరిగింది. తనపై దాడి చేశారంటూ రాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రాజు తమ కారులపై దాడి చేసి తమ కుటుంబ సభ్యులను దూషించాడని.. నందిగం సురేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నందిగం సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు.. రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అధికార పార్టీ నేతల ప్రోద్భలంతో నందిగం సురేష్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగం సురేష్‌ని అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు.


 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)