తిరుమల లడ్డూ కల్తీ అయిందనే చెప్పండి

Published on Thu, 01/29/2026 - 05:39

సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తాము చేసిన ప్రచారం తప్పని తేలిన నేపథ్యంలో బుధవారం కేబినెట్‌ భేటీలో చంద్రబాబు దానిపై మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. సిట్‌ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందనే విషయాన్ని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం ముగిశాక చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై రాజకీయ అంశాలపై మాట్లాడారు. 

తిరుమల లడ్డూ వ్యవహారంపై గతంలో తాము చేసిన ఆరోపణలను ఎలా సమర్థించుకోవాలనే దానిపైనే ఎక్కువసేపు చర్చించినట్లు సమాచారం. సిట్‌ ఇచ్చిన నివేదికలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొన్నారని, ఇది వైఎస్సార్‌సీపీకి ఆయుధంగా మారిందని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. దీనిపై బాబు స్పందిస్తూ.. సిట్‌ నివేదికపై వైఎస్సార్‌సీపీ దుష్ప్రచారం చేస్తోందని ప్రచారం చేయాలని, అసలు ఇంకా నివేదిక బయటకు రాలేదని చెప్పాలని సూచించినట్లు సమాచారం. 

గతంలో తాను చెప్పినట్లు జంతువుల కొవ్వు కలిసిందనే అంశాన్ని వదిలేసి కల్తీ జరిగిందనే విషయాన్ని మాత్రమే బయటకు చెప్పాలని.. అలాగే, పాలులేకుండా నెయ్యి తయారైందని ప్రచారం చేయాలని ఆయన సూచించారు. మరోవైపు.. సిట్‌ నివేదికను అధికారికంగా తెప్పించాలని, దానిపై ఇంకా ఎలా మాట్లాడాలో చూద్దామని అన్నట్లు సమాచారం. అయితే, ఇద్దరు మంత్రులు మాట్లాడుతూ.. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ స్పీడుగా ఉందని చంద్రబాబు, టీడీపీ చెప్పినవన్నీ అబద్ధాలేననే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లారని అన్నట్లు తెలిసింది. అయినా పర్వాలేదని, సిట్‌ నివేదిక ఎలా ఉన్నా వెనక్కి తగ్గకుండా కల్తీ జరిగిందనే విషయాన్ని ప్రచారం చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. సిట్‌ నివేది­క వైఎస్సార్‌సీపీకే వ్యతిరేకంగా ఉన్నట్లు చెబు­దా­మని, టీటీడీ మాజీ చైర్మన్‌ సుబ్బారెడ్డి పీఏ అకౌం­ట్‌లో డబ్బులు జమ అయిన విషయాన్ని ఎ­క్కు­వగా మీ­డియాలో చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మంత్రుల పనితీరుపై అసంతృప్తి..
చంద్రబాబు యథావిధిగా ఈ సమావేశంలోనూ మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరికి తమ శాఖలపై ఏమాత్రం పట్టులేదని, తమకు సంబంధించిన సబ్జెక్టులపై కూడా మాట్లాడలేకపోతున్నారని, రాజకీయ విమర్శలను వెంటనే తిప్పికొట్టలేకపోతున్నారని చెప్పినట్లు సమాచారం. లడ్డూ  విషయంలో సిట్‌ నివేదికపై వైఎస్సార్‌సీపీ దూకుడుగా వెళ్తున్నా తమ వాళ్లు ధీటుగా జవాబు ఇవ్వలేకపోయారని అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)