Breaking News

ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు

Published on Mon, 07/13/2026 - 11:29

సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నిరసన మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే అసంతృప్తితో.. ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. సోమవారం నగరంలో ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది.

రెండేళ్లు దాటినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఫెడరేషన్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా ఫెడరేషన్‌ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి గుండు చేయించుకున్నారు. ఆయనతో పాటు పలువురు ఉద్యోగులు కూడా ఇదే తరహాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా.. బాబు సర్కార్‌పై వాళ్లు ఆగ్రహం వ్యకక్తం చేశారు. 

ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని ఫెడరేషన్‌ ఆరోపించింది. పీఆర్సీ, ఐఆర్‌, డీఏలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేసింది. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఐఆర్‌ విషయంలోనూ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేసిందని నేతలు విమర్శించారు. సరెండర్‌ లీవ్‌లకు సంబంధించిన చెల్లింపులు కూడా నిలిచిపోయాయని ఆరోపించారు.

నెలకు రూ.1500 కోట్లు క్షవరం.. 
ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఫెడరేషన్‌ నేతలు మండిపడ్డారు. ప్రతి నెలా రూ.1500 కోట్ల మేర ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలు ఉద్యోగులకు కూడా పూర్తిగా తెలియకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని(క్షవరం చేస్తోందని) విమర్శించారు.

వలంటీర్ల హామీలపైనా ప్రశ్నలు
ఉద్యోగులతో పాటు వలంటీర్లకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఫెడరేషన్‌ ఆరోపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో నిర్వహించిన ఈ నిరసన రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)