Breaking News

ఏపీ లాకప్‌డెత్‌లపై లోక్‌సభలో చర్చకు నోటీసు

Published on Mon, 07/20/2026 - 09:16

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి (సోమవారం) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. తొలిరోజే ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసుల వేధింపులు, లాకప్‌ డెత్‌ల అంశాలను లేవనెత్తేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ఈ మేరకు లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసును తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇచ్చారు.

ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న పలు కస్టడీ మరణాలు, పోలీసుల తీరుపై చర్చకు అనుమతించాలని ఆయన నోటీసుల్లో కోరారు. గాదె సాయి కృష్ణ, ఏడుకొండలు, మాల గంగమ్మ, క్రాంతి కుమార్‌, దరియా హుస్సేన్‌ వంటి కేసులను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సభ దృష్టికి తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపుల అంశాలపైనా చర్చకు అవకాశం కల్పించాలని వైఎస్సార్‌సీపీ తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు. 

ఇటీవల ఏపీలో చోటుచేసుకున్న కొన్ని లాకప్‌ డెత్‌ ఘటనలు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. పోలీసుల వ్యవహారశైలి, కస్టడీలో ఉన్న వ్యక్తుల రక్షణ, న్యాయ ప్రక్రియపై పలు ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ అంశాలను జాతీయ స్థాయిలో ప్రస్తావించాలని వైఎస్‌ జగన్‌ ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, వీటిపై పార్లమెంట్‌లో చర్చ అవసరమని ఎంపీలు భావిస్తున్నారు. 

ఏపీ శాంతిభద్రతల అంశంపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన నోటీసును స్పీకర్‌ అనుమతిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. అదే గనుక జరిగితే.. కూటమి ప్రభుత్వ అరాచకాలపై చర్చతో లోక్‌సభ హీటెక్కే అవకాశాలు ఉన్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)