చంద్రన్న బోడిగుండు పథకం!

Published on Tue, 07/14/2026 - 04:28

సాక్షి, అమరావతి: ‘ఎన్నికల సమయంలో చంద్ర­బాబు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెర­వే­ర్చ­లేదు. కానీ ఉద్యోగుల కోసం చంద్రన్న బోడిగుండు పథకాన్ని అమలు చేస్తున్నారు’ అని ప్ర­భుత్వ ఉ­ద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, సచివాలయ ఉ­ద్యోగు­ల సంఘం మాజీ అధ్యక్షుడు కే వెంకట్రామి­రెడ్డి విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యా­యులు, పోలీసులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చక­పోగా, వారికి రెగ్యులర్‌గా రావాల్సిన డీఏలు, ఐ­ఆర్, పీఆర్సీ వంటివి కూడా ఇవ్వకుండా ఉద్యోగు­లు అందరికీ నున్నగా క్షవరం చేసే కార్య­క్రమం విజ­యవంతంగా అమలు చేస్తున్నారని వాపోయారు. చంద్రబాబు బోడిగుండు పథకం అమలు చేస్తున్నారంటూ వెంకట్రామిరెడ్డి సహా మరో ఇద్దరు నేతలు అందరిముందర గుండ్లు చేయించుకున్నారు.  

ఉద్యోగులు కోల్పోయింది రూ. 37 వేల కోట్లకు పైమాటే..
ప్రతినెలా ఉద్యోగులకు చంద్రబాబు గారి ప్రభు­త్వం చేస్తున్న క్షవరం విలువ అక్షరాలా రూ.1500 కోట్లని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలో ఉద్యోగులకు చేసిన మొత్తం క్షవరం విలువ సుమారు రూ.37 వేల కోట్లని చెప్పారు. ఇవి తాను ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం చెప్పడంలేదని, పూర్తి లెక్కలు ఇస్తున్నానని చెప్పి ఆ వివరాలు విడుదల చేశారు. ఈ రూ.37 వేల కోట్లు కేవలం కూటమి రెండు సంవత్సరాల పాలనకు సంబంధించిన బకాయిలు, ఎగవేతలు మాత్రమేనన్నారు. ఉద్యోగులను ఈ స్థాయిలో ముంచిన ఘనత గతంలో ఎవరికీ లేదన్నారు. 

అమరావతికి సోకులు.. తుగ్లక్‌ పాలనకు నిదర్శనం..
ఉద్యోగులకు రూ.37 వేల కోట్ల బకాయిలు ఇవ్వ­కుండా అమరావతిలోని భవనాల సోకులకు వేల కో­ట్ల రూపాయలు ఖర్చు పెడుడుతున్నారని తెలిపా­రు. అమరావతిలో ప్రభుత్వ భవనాల ముందు ప­క్క బిగించే అద్దాల కోసం రూ.2,500 కోట్లు ఖ­ర్చు పెడుతోందని, చదరపు అడుగుకు అద్దాల కోసం రూ.5 వేలు ఖర్చు పెడుతోందన్నా­రు. ఈ భవనాల నిర్మాణం సోకులు, అన్నీ కలిపి చదరపు అ­­డుగుకి రూ.20 వేల ఖర్చు పెడుతున్నా­రని తెలి­పారు. ఒక పక్క ఉద్యోగులకు వేల కోట్ల రూపా­యిలు బకాయి­లు పెట్టి, అమరావతిలో సోకులకు రూ.వేల కో­ట్లు ఖ­ర్చు బెట్టడం తుగ్లక్‌ పాలన కా­దా అని ప్రశ్నించా­రు. ఆర్థికేతర అంశాల్లో ప్ర­­భు­త్వం ఉద్యోగులపై సానుకూలంగా లేదన్నారు. 

ఆత్మహత్యలే మేలనుకుంటున్నారు..
ప్రభుత్వం పెట్టే టార్చర్‌ భరించలేక గత జూన్‌ నెలలో 10 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు, గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. మరో ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేయలేమంటూ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వారు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవా­లని ప్రజలను కోరారు.

ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి రాజరికపు కాలం నాటి బానిసల కంటే హీనంగా ఉందని, వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేవని అయినా అడిగే దిక్కు లేదన్నారు. గత ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ మీటింగు పెట్టి ఉద్యోగుల సమస్యలు వినేదని, ఇప్పుడు ఉద్యోగుల సమస్యలు వినే వారు కూడా లేరన్నారు. ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఉద్యోగ సంఘాల నాయకులు సరిగా స్పందించడం లేదన్నారు. 
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)